రాజ్యసభ ఎన్నికలకు ఇవాళ నోటిఫికేషన్ విడుదల కానుంది. తెలంగాణ అసెంబ్లీలో ఈ నెల 15 వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఇక, 16వ తేదీన నామినేషన్లను పరిశీలించనున్నారు. ఇక, 20వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. అనంతరం అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైతే ధ్రువపత్రాలను అందించనున్నారు.. లేకుంటే ఈ నెల 27న ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. అదే రోజూ సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు కార్యక్రమం చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నారు. బీఆర్‌ఎస్ రాజ్యసభ ఎంపీలు బడుగుల లింగయ్య యాదవ్, సంతోష్ కుమార్, వద్దిరాజు రవిచంద్ర పదవీ కాలం ఏప్రిల్ 2తో ముగిసిపోతుంది. అయితే, కాంగ్రెస్ పార్టీ, మిత్రపక్షం కలిపి 65 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. రెండు ఎంపీ స్థానాలు, బీఆర్ఎస్‌కు 39 మంది ఎమ్మెల్యేలు ఉండగా ఒక స్థానం దక్కనుంది.