పదేళ్లు వారికి ఉద్యోగాలు ఇవ్వకూండా తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది.. ఇప్పుడు నిరుద్యోగులను కేసీఆర్ ఇంటికి పంపాలా.. కేటీఆర్ ఇంటికి పంపాలా? అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశ్నించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డిపై రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖా మాత్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ కోసం మంత్రి పదవులను తృణప్రయంగా విసిరికొట్టిన నాపై.. మద్యనిషేదంలో అక్రమంగా మందు అమ్మి జైలుకు పోయిన జగదీష్ రెడ్డి మాట్లాడటం విడ్డూరమన్నారు వెంకట్రెడ్డి. ప్రజలు నమస్తే పెడితే ఎక్కడ పని అడుగుతారో అని మోహం కిందకు వేసే అహంకారి వ్యక్తి నిత్యం ప్రజల్లో ఉండే నాపై ఆరోపణలు చేస్తున్నాడని ఆయన…
ఈ ఓటమి స్పీడ్ బ్రేకర్ మాత్రమేనన్నారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు. తెలంగాణ భవన్లో ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భవిష్యత్ లేదని కార్యకర్తలు కుంగిపోవద్దు .భవిష్యత్ లో వచ్చేది మళ్ళీ మనమేనని ఆయన అన్నారు. కాంగ్రెస్ 420 హామీల్లో వాళ్ళు పావలా వంతుకు మీంచి అమలు చేయలేరని, మల్కాజ్ గిరి లో పోయిన సారి రేవంత్ తక్కువ ఓట్లతో గెలిచాడన్నారు. రేవంత్ నియోజకవర్గాన్ని ఎపుడూ పట్టించుకున్న పాపాన పోలేదని, సీఎం రేవంత్ ప్రాతినిధ్యం వహించిన…
రాష్టాన్ని బీఆర్ఎస్ నిర్వీర్యం చేసిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణను నాశనం చేసింది, ద్రోహం చేసింది, దోచుకుంది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా.. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని, అలా చేయడం తగదని మంత్రి ఉత్తమ్ సూచించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రూ.3 వేల కోట్ల నుంచి రూ.50 వేల కోట్లు భారం పెంచిందని తెలిపారు.
సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 2024-25 ఆర్థిక సంవత్సరం వార్షిక బడ్జెట్ కోసం పౌర సరఫరాల శాఖ రూపొందించిన ప్రతిపాదనల పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సివిల్ సప్లై శాఖ బడ్జెట్ ప్రిపరేషన్ పై చర్చ జరిగిందని అన్నారు. పేదవాడికి బియ్యం సప్లై చేసే శాఖ పై గత ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. 2014-15లో రూ.383 కోట్లు ఏరియర్స్ ఉంటే..…
మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించాలని.. లేదంటే వారి తరుఫున గొంతు విప్పుతామని కేటీఆర్ అన్నారు. ఈ క్రమంలో తాజాగా మంత్రి సీతక్క స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మీడియాతో మాట్లాడుతూ.. వెయ్యి పశువులను తిన్న రాబంధు నీతి కథలు చెప్పినట్టు కేటీఆర్ వ్యవహారం ఉందంటూ కౌంటర్ వేశారు. సర్పంచ్లకు నిధులు ఇవ్వకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం ఘోష పెట్టిందన్నారు. కేటీఆర్ ఇప్పుడు సర్పంచ్ల గురించి మాట్లాడటం…
బీజేపీ ఉన్నదా ? లేదా ? అన్నది వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో చూపెడతామని అన్నారు బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబంలో KCR, KTR, కవిత, హరీష్, సంతోష్ ఈ ఐదుగురు పోటీ చేయాలని సవాల్ చేశారు. కాగా.. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు బీజేపీ గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అంతేకాకుండా.. బీఆర్ఎస్ గత పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్లను అమ్ముకున్నారని…
కాంగ్రెస్ మంత్రులపై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కేఆర్ఎంబీలో తెలంగాణ చేరిందని కేంద్రం సమావేశ మినిట్స్ లో స్పష్టంగా పేర్కొన్నారని తెలిపారు. ఇప్పుడు చేరలేదని రాష్ట్ర మంత్రులు బుకాయిస్తున్నారని ఆరోపించారు. మంత్రుల నోటి మాట ప్రామాణికమా? మినిట్స్ ప్రామాణికమా? అని నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ మంత్రులు చిన్న పిల్లల్లా మాట్లాడుతున్నారని విమర్శించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనలో పెట్టుబడులు తీసుకువస్తున్నామని చెప్పారని, అదానీ గ్రూపుతో 12వేల కోట్ల ఒప్పందాలు కుదిరాయని ప్రకటించారన్నారు బీజేపీ మాజీ ఎమ్మెల్యే NVSS ప్రభాకర్. కాంగ్రెస్ అధికారంలోకి రాక ముందు అదానీ, అంబానీకీ మోడీ దేశ సంపదను దోచి పెడుతున్నారని విమర్శించారని, పని గట్టుకొని ప్రధానిపై విమర్శలు చేశారని ఆయన అన్నారు. కేటీఆర్ తెలంగాణ ప్రతినిధిగా ఐదు సార్లు దావోస్ పర్యటనకు వెళ్లారని, గత ప్రభుత్వం 21 వేల కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చామని గొప్పగా…
Jupally Krishna Rao: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తీసుకోవాల్సిన అవసరం కాంగ్రెస్ కు లేదని ఎక్సైజ్ పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతలు కొంగ జపం చేస్తున్నారని అన్నారు.