రిపబ్లిక్ డేను పురస్కరించుకుని గవర్నర్ తమిళిసై రాజ్‌భవన్‌లో తేనేటి విందు ఏర్పాటు చేశారు. సాయంత్రం 6 గంటలకు ఎట్‌హోం కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ ప్రోగ్రామ్‌కి అధికార, ప్రతిపక్ష నేతలను గవర్నర్ ఆహ్వానించారు. రాజ్‌భవన్‌లో జరిగి ఎట్‌హోం కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు మంత్రులు, అధికారులు హాజరుకానున్నారు. ఇందుకోసం రాజ్‌భవన్ సుందరంగా ముస్తాబైంది. అయితే ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ హాజరుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గులాబీ పార్టీ నేతలు హాజరవుతారా? లేదా? అన్న ఆసక్తి నెలకొంది. కేసీఆర్…
బీఆర్ఎస్ పార్టీ నేతలపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. రాష్ట్ర విభజన కోసం కాంగ్రెస్ పని చేసిందని తెలిపారు. కోదండరాంకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంపై ఆయన మాట్లాడుతూ.. కోదండరామ్ ను బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా మోసం చేసిందో తెలిపారు. ఉద్యమ సమయంలో అన్ని పార్టీలు ఒక ఛత్రి కింద ఉండాలనే కోదండరాంని ఎన్నుకున్నారని తెలిపారు. కోదండరాం డైరెక్షన్ లో తాను లేనన్నారు. కోదండరాం భీష్మ పాత్ర పోషించారని అన్నారు.
మెదక్: పార్లమెంట్ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ సన్నద్ధమవుతోంది. గెలిపే లక్ష్యంగా అభ్యర్థుల ఎంపికకు తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత కేడర్ బలహీనపడింది. ఈ నేపథ్యంలో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోనైనా మెజార్టీ స్థానాలు దక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయా పార్లమెంట్ నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు. పార్టీ శ్రేణులను ఉత్తేజపరుస్తూ ఎన్నికల మూడ్‌లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని…
ఎమ్మెల్సీ కవిత కామెంట్స్‌కు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. నిరుపేద నిరుద్యోగ యువకుడి బలవన్మరణానికి కారణమైన వ్యక్తి జైల్లో ఉంటే వాస్తవాలు తెలియకుండా కవిత ఆరోపణలు చేయడం విడ్డూరమని ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్ ప్రభుత్వం భయపెడుతుందని భావించడం వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నామని పేర్కొన్నారు. గతంలో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసినట్టే చేస్తారనుకోవడం విచారకరమని తెలిపారు. సారంగాపూర్ మండలం బట్టపల్లిలో శివ నాగేశ్వర్ అనే యువకుడు ఉరి వేసుకొని చనిపోతే A4 గా ఉన్న…
అసెంబ్లీలో 39 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారని.. అది ఏ మాత్రం చిన్న సంఖ్య కాదన్నారు. అలాగే 25 మంది ఎమ్మెల్సీలు, 14 మంది ఎంపీలు బీఆర్ఎస్కు ఉన్నారని గుర్తుచేశారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ను ఎక్కువ.. తక్కువ చేస్తే మా తడాఖా ఏంటో చూపిస్తామని చెప్పుకొచ్చారు
KTR Tweet: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ట్వీట్ చేశారు. ఇది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్‌గా మారింది. దేశం మొత్తం గణతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటుంది.
కార్యకర్తలు రక్తం చెమటగా మార్చడం తోనే నేను సీఎం గా గౌరవం దక్కిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇవాళ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన కాంగ్రెస్ బహిరంగ సభలో ముఖ్య అతిథిగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రారంభం అయ్యాకా.. కర్ణాటక.. హిమాచల్ ప్రదేశ్.. మూడో విజయం తెలంగాణ అని ఆయన వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే కాగానే ఆరు నెలలు కాకముందే…
వారం రోజుల్లో పార్లమెంట్ అభ్యర్థుల ఎంపిక ఉంటుందని తెలిపారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్ పార్లమెంట్లో పోటీ కోసం కాకుండా గెలుపే లక్ష్యంగా బరిలో ఉండాలన్నారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్, బీఆర్ఎస్ లు దోపిడి దొంగల పార్టీలు అని ఆయన వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ చేసిన అవినీతిపై ఈ ప్రభుత్వం విచారణ చేసి శిక్షలు వేస్తుందంటే అది భ్రమేనని ఆయన విమర్శించారు. తెలంగాణ ప్రజలు నమ్మడం లేదని, బీజేపీ అగ్గి…
కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేసిన వారిని అధికార మదంతో రాసిరంపాన పెట్టిన వారిని ఒక చూపు చూడాల్సిందే అంటూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాట్ కామెంట్ చేశారు. కష్టకాలంలో పార్టీ కోసం పని చేయని వారికి మనం ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని, ప్రభుత్వ పథకాలని గ్రామ నాయకత్వం ద్వారానే ప్రజలకు అందాలని మంత్రి తుమ్మల నాగేశ్వరావు అన్నారు .మనకి సహకరించని వారిని మనల్ని ఇబ్బందులు పెట్టిన వారిని రాసి రంపాల పెట్టిన…