శాసన సభ జరిగిన జరుగుతున్న తీరు ఖండిస్తున్నాను అని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. మీరు మాట్లాడి, మాకు మైకులు ఇవ్వక పోవడం సభా సంప్రదాయాలకు విరుద్ధం అన్నారు.
నేడు జరిగిన తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మేడిగడ్డకు అన్ని పార్టీల సభ్యులను ఆహ్వానించాం.. సభ్యులు వాస్తవాలు చూడాలన్నారు. మేడిగడ్డకు కేసీఆర్ వస్తానంటే హెలికాఫ్టర్ కూడా సిద్ధం చేస్తామన్నారు.
అసెంబ్లీకి రాని వ్యక్తి.. మంగళవారం నల్గొండలో అసెంబ్లీకి వెళ్తావా అంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఉద్దేశించి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం అసెంబ్లీలో కృష్ణా జలాలపై చర్చ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడారు. కృష్ణా జలాలపై అసెంబ్లీలో చర్చించి కేంద్ర ప్రభుత్వానికి తీర్మానం చేసి పంపాలని కోరితే ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి రాలేదని విమర్శించారు . అసెంబ్లీకి రాని వ్యక్తి రేపు బహిరంగ సభకు వెళ్తారా అంటూ…
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. అయితే.. ఈ నేపథ్యంలోనే ఇవాళ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా.. హరీష్, కడియం లాగా.. మేము జి హుజూర్ బ్యాచ్ కాదన్నారు. కడియం, హరీష్ లు మమ్మల్ని చిల్చాలను గుంటకాడ నక్కల్లా ఎదురుచూస్తున్నారని, మేము పదవుల కోసం కాదు.. ప్రజల కోసం ఉండేవాళ్ళమన్నారు. బీఆర్ఎస్ చీప్ పాలిటిక్స్ మానుకోవాలని ఆయన హితవు పలికారు.…
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి బాల్క సుమన్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బాల్క సుమన్ దగ్గరే చెప్పు ఉందా..? మా మెట్టు సాయి దగ్గర లేదా..? అని తన అనుచరుడి చెప్పు చూపించారు. తెలంగణ ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి బూటును పైకెత్తి చూపిస్తుండగా.. జగ్గారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. పిలగానివి.. పిలగాని తీరు…
తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు ప్రవేశ పెట్టిన బడ్జెట్ తిరోగమన బడ్జెట్.. 6 గ్యారంటీలను అటకెక్కించిన బడ్జెట్ అని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు.
తెలంగాణ భవన్లో జీహెచ్ఎంసీ పరిధిలోని పార్టీ కార్పోరేటర్లతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయ దురుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నగర అభివృద్ధిని అడ్డుకుంటుందని ఆరోపించారు. 60 రోజుల కాంగ్రెస్ పార్టీ పరిపాలన అయోమయంగా ఉందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలలో ఉన్న 13 కార్యక్రమాలతో పాటు ఇచ్చిన, 420 హామీలకు అమలుకు 57 వేల కోట్లు మాత్రమే బడ్జెట్ లో కేటాయించిందని తెలిపారు.
అసెంబ్లీ వేదికగా బీఆర్ఎస్పై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఫైరయ్యారు. నియోజకవర్గ పనుల కోసం బీఆర్ఎస్కు చెందిన ఎమ్మెల్యేలు తనను కలుస్తున్నారని.. సమస్యలు చెప్పుకోవడానికి ఎవరొచ్చినా కలుస్తామని రేవంత్రెడ్డి తెలిపారు.