పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయనని గతంలోనే పార్టీ అధిష్టానానికి చెప్పానని, జనంలో తిరస్కరించినబడిన వాళ్లు.. పదవుల కోసం విమర్శలు చేస్తున్నారన్నారు బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఠాగూర్, ఠాక్రే మీద ఆరోపణలు,వాస్తవాలను బయట పెట్టింది… అధిష్టానానికి ఫిర్యాదు చేసింది కాంగ్రెస్ నాయకులు కాదా? అని ఆయన ప్రశ్నించారు. ఈ ఇద్దరు ఇంచార్జీలు కాంగ్రెస్ పార్టీకి జీవం పోస్తే.. ఎందుకు మార్చారో కాంగ్రెస్ అధిష్టానం చెప్పాలని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం…
తెలంగాణ నుంచి రాజ్యసభ ఎంపీలుగా ముగ్గురు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మూడు సీట్లకు మూడు నామినేషన్లే రావడంతో ఎన్నిక ఏకగ్రీవం అయింది. కాంగ్రెస్ నుంచి రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి వద్దిరాజు రవిచంద్ర ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారులు ప్రకటించారు. కాగా.. రేపు ఎన్నిక ధ్రువీకరణ పత్రాన్ని రేణుకా చౌదరి తీసుకోనున్నారు. మరోవైపు.. అనిల్ కుమార్ యాదవ్ కు రిటర్నింగ్ అధికారులు ఎన్నిక ధ్రువీకరణ పత్రం అందజేశారు.
తెలంగాణలో బీజేపీ విజయ సంకల్ప యాత్రలు చేపట్టింది. ఇందులో భాగంగా.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కృష్ణమ్మ యాత్రను మక్తల్ కృష్ణ గ్రామంలో కేంద్రమంత్రి పురుషోత్తం రూపాలతో కలిసి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2013లో ఇదే కృష్ణా నుంచి తెలంగాణ పోరు యాత్ర ప్రారంభించామని తెలిపారు. ఆ తర్వాత కాంగ్రెస్ మెడలు వంచి తెలంగాణ తెచ్చామని చెప్పారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ అన్ని పార్లమెంట్ స్థానాలు బీజేపీ గెలవాలి అని శపథం…
Kishan Reddy: పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఏ రాజకీయ పార్టీతో పొత్తు ఉండదని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే వెళుతుందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
మేడిగడ్డ డ్యామ్ ను బూచిగా చూపెట్టి పదే పదే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ విరుచుకుపడ్డారు. ఒక్క 3 ఫిల్లర్లు కుంగాయి.. అయితే వాటిని పునరుద్ధరణ పనులు చేయకుండా.. నాటి తమ ప్రభుత్వం పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మేడిగడ్డ డ్యామ్ పై మాకు అనుమానం వస్తుంది.. ఎందుకంటే వాళ్ళు కుంగిన ఫిల్లర్ల దగ్గరకు మళ్ళీ నీళ్లు వదులుతున్నారని తెలిపారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో విజయ సంకల్ప యాత్ర పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలను బీఆర్ఎస్ పదేళ్లుగా మోసం చేసిందని ఫైర్ అయ్యారు. తెలంగాణకు ఇక బీఆర్ఎస్ పార్టీ అవసరం లేదన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు కుటుంబ పార్టీలేనని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ల మాదిరిగా చీకటి రాజకీయాలు మేం చేయమన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్తో పొత్తు ఉండదని కిషన్ రెడ్డి…
BJP MP K. Laxman: ఎన్నికల ముందే కాంగ్రెస్ కాడ ఎత్తేసిందని, మూడో సారి మోదీ మళ్ళీ ప్రధాని కాబోతున్నారని బీజేపీ ఎంపీ డాక్టర్ K.లక్ష్మణ్ అన్నారు. బీజేపీ కన్వెన్షన్ లో దేశ వ్యాప్తంగా ప్రతినిధులు పాల్గొన్నారన్నారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. అసెంబ్లీ వేదికగా బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అయితే.. ఈ నేపథ్యంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. అన్నారం…సుందిళ్ల..మేడిగడ్డ మూడే దెబ్బతిన్నాయి కదా అంటున్నారని, అంత సింపుల్ గా తీసుకుంటున్నారు బీఆర్ఎస్ వాళ్లని మండిపడ్డారు. సీరియస్ ప్రాబ్లం తీసుకుని.. అయితే ఏంటి అన్నట్టు మాట్లాడితే ప్రయోజనం ఉందా..?అని ఆయన ప్రశ్నించారు. కుంగిన బ్యారేజీల పై నివేదిక తెప్పిస్తామన్నారు. ఎలా పునరుద్దరణ చేయాలి అనేది ఆలోచిస్తామని, మా…
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. ఇవాళ ఇరికేషన్ శ్వేతపత్రంపై అసెంబ్లీలో చర్చ జరిగింది. కేసీఆర్ సభకు రావాలని, ప్రాజెక్టులను తొందరగా కట్టాలన్న ఆతృత తప్ప, వాటి నాణ్యత గురించి పట్టించుకోలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ హయాంలోనే మేడిగడ్డ కూలిపోయిందని మంత్రి పొంగులేటి వ్యాఖ్యానించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరిగిన విషయాలను కోడ్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ కు అన్యాయం జరిగిందనే తెలంగాణ తెచ్చుకున్నామన్నారు…
రాష్ట్రంలోని ప్రాజెక్టుల నిర్మాణంలో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తూ శాసనసభలో పవర్ పాయింట్ ప్రజెంటెషన్ ఇచ్చింది. దీనిపై దీర్ఘకాలిక చర్చలో భాగంగా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి హరీశ్ రావు మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది.