BRS KTR: బీఆర్ఎస్ పార్టీపై వైరం కారణంగా సాగునీటి ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం త్యాగం చేయవద్దని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
సముద్రంలో ఈత కొట్టే సమయం ఉంది మోడీకి కానీ.. మణిపూర్ వెళ్లే సమయం మాత్రం లేదని మండిపడ్డారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గుడి మీ అయ్య జాగిరా అంటూ ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీని కూడా గుడిలోకి పోకుండా అడ్డుకుంటున్నారని, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తానన్నారు. ఖమ్మం నుండి పోటీ చేస్తానని, అక్కడి సమస్యలపై కోట్లాడిన అని ఆయన వ్యాఖ్యానించారు. చనిపోయిన రైతులకు సాయం చేసిన అని ఆయన తెలిపారు. ఏడు…
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ లు రోజుకు డ్రామా ఆడుతున్నాయని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ ఆరోపించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రెండు పార్టీల డ్రామాలకు అంతం లేకుండా పోయిందని, లిక్కర్ డ్రామా లో బిజెపి రాజకీయ లబ్ది పొందాలని చూస్తోందన్నారు. మోడీ, అమిత్ షా ల ముద్దు బిడ్డ కేసీఆర్ అని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్న పార్టీలపై నేతలపై దాడి చేస్తుంది బీజేపీ అని ఆయన మండిపడ్డారు.…
Mallu Ravi: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ పై టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి ఫైర్ అయ్యారు.. నాగర్ కర్నూల్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ అవాకులు, చెవాకులు మాట్లాడారని మండిపడ్డారు.
కొత్తగూడెంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 27న చేవెళ్ల సభలో మరో రెండు గ్యారెంటీ పథకాల అమలు ప్రకటన చేస్తామని తెలిపారు. మార్చి నెలలో 200 యూనిట్లు లోపు విద్యుత్ బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. అంతేకాకుండా.. డ్వాక్రా సంఘాలకు త్వరలో వడ్డీ లేని రుణాలు అందిస్తామని చెప్పారు. రేపు సాయంత్రం 43,000 మంది సింగరేణి కార్మికులకు కోటి…
మెదక్ జిల్లా తూప్రాన్లో నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప యాత్రలో కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏప్రిల్ మొదటి వారంలో దేశ వ్యాప్తంగా ఎన్నికలు జరగనున్నాయని తెలిపారు. ఈ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం విజయ సంకల్ప యాత్రలతో రాష్ట్రమంతా ప్రయాణిస్తున్నామని పేర్కొన్నారు. దేశానికి మోడీ ఎంతో సేవ చేశారు.. టాయిలెట్ నుండి చంద్రయాన్ వరకు నరేంద్ర మోడీ చేయని అభివృద్ది కార్యక్రమం లేదని కిషన్…
లోక్ సభ ఎన్నికల వేళ.. బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన పలువురు కీలక నేతలు కారు దిగి హస్తం పార్టీలో చేరారు. తాజాగా.. బీఆర్ఎస్కు మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి రాజీనామా చేశారు. కృష్ణారెడ్డితో పాటు రంగారెడ్డి జిల్లా జడ్పీ ఛైర్పర్సన్ తీగల అనితారెడ్డి రాజీనామా చేశారు. ఇప్పటికే ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి దంపతులు, బొంతు రామ్మోహన్ దంపతులు, మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్ధీన్, డిప్యూటీ మేయర్…
బీఆర్ఎస్, బీజేపీపై తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సిద్ధాంతాలు చెప్పే పార్టీలు డూప్లికేట్ పార్టీలు అని విమర్శించారు. మాట మీద నిలబడి సెక్యులర్ మాటకు కట్టుబడి ఉన్నది కేవలం కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీ అవకాశవాద రాజకీయాలు చేస్తుందని దుయ్యబట్టారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ కి సిద్ధాంతాలు లేవని అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ లోపాయకారి ఒప్పందంలోనే కవితకు సీబీఐ నోటీసులు ఇచ్చారని ఆరోపించారు. కొత్త నాటకంకు రెండు…
Ponnam Prabhakar: బిఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న అవమానాన్ని భరించలేక కాంగ్రెస్ పార్టీలోకి నాయకులు వస్తున్నారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
KTR: దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. ఇవాళ ఉదయం కార్ఖానాలోని ఆమె నివాసానికి మాజీ మంత్రులు మహమూద్ అలీ, మల్లారెడ్డితో కలిసి కేటీఆర్ వెళ్లి నందిత చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.