నేడు బీజేపీ తొలి జాబితా.. లిస్ట్‌లో మోడీ, అమిత్ షా!
పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ముందుకు దూసుకుపోతుంది. ఇప్పటికే కొన్నిచోట్ల ప్రచారాలు కూడా మొదలెట్టింది. ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండంతో త్వరలోనే అభ్యర్థుల పేర్లను ఖరారు చేయనుంది. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేసేందుకు ప్రధాని మోడీ సారథ్యంలో పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) గురువారం సమావేశం అయింది. గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము మూడింటి వరకు కమిటీ చర్చలు జరిపింది. ఈ రోజు ఏ క్షణమైనాఎప్పుడైనా తొలి జాబితా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.
బీఆర్ఎస్ నేతలకు తప్పిన ప్రమాదం.. పేలిన బస్సు టైర్
చలో మేడిగడ్డకు వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బస్సు టైరు ఒక్కసారిగా పగిలింది. దారిలోనే బీఆర్ఎస్ నేతలు వెళుతున్న బస్సు ఆగిపోయింది. ఈ ఘటనతో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు భయాందోళనకు గురయ్యారు. బస్సులో కొందరు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, మీడియా ప్రతినిధులు ఉన్నారు. ఈ ఘటన స్టేషన్ ఘన్ పూర్ సమీపంలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న మిగిలిన ఎమ్మెల్యేలు, ఇతర నేతలు సహాయక చర్యలు చేపట్టారు. మరోవైపు స్థానికంగా ఉన్న మెకానిక్‌ను పిలిపించిన నేతలు సమీపంలోని టైరును మార్పించారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఏమీ కాకపోవడంతో ఎమ్మెల్యేలు ఊపిరి పీల్చుకున్నారు.
పేదలకు మంచి చేయటం కోసం యుద్ధం చేయాల్సి వస్తోంది: సీఎం జగన్
శుక్రవారం కృష్ణా జిల్లా పామర్రులో రూ.708.68 కోట్ల ‘జగనన్న విద్యా దీవెన’ నిధులను ముఖ్యమంత్రి వైస్ జగన్ మోహన్ రెడ్డి విడుదల చేశారు. సీఎం జగన్ బటన్ నొక్కి పిల్లలు, తల్లుల జాయింట్ ఖాతాల్లోకి నిధులు విడుదల చేశారు. రాష్ట్రంలో ఉన్నత విద్య అభ్యసిస్తున్న 9.44 లక్షల మంది విద్యార్థులకు 2023 అక్టోబరు-డిసెంబరు త్రైమాసికానికి సంబంధించిన నిధులను బ్యాంకు ఖాతాలకు జమ చేస్తారు. విద్యా దీవెన, వసతి దీవెన పథకాలకు ఇప్పటివరకూ రూ.18,002 కోట్లను వ్యయం చేసిందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. పేద విద్యార్థులకు ఉన్నత చదువులు భారంగా మారకూడదనే ఉధ్దేశంతో ఫీజు రియింబర్స్‌మెంట్ పథకాలను అందిస్తున్నారు.
బీఆర్ఎస్ బస్సు ఘటన.. షెడ్డుకు పోవాల్సిందే అన్న ఉత్తమ్
బీఆర్ఎస్ చేపట్టిన చలో మేడిగడ్డ కార్యక్రమంలో బస్సు ప్రమాదం సంచలనంగా మారింది. ఎమ్మెల్యేలు వెళుతున్న బస్సు టైరు పగలడంతో బీఆర్ఎస్ నేతలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. డ్రైవర్ చాకచక్యంతో బస్సును పక్కకు ఆపడంతో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. అయితే బస్సు ఘటనపై నీటిపారుదల, పౌరసరఫరాలు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్తున్న బస్సు టైర్ పగిలిందని చూశా అన్నారు. ఇక కారు టైర్లు అన్నీ మిగిలిపోయాయని సెటైర్ వేశారు. కారు ఇక షెడ్డుకు పోవాల్సిందే అని అన్నారు.
నన్ను ఈ స్థాయిలో ఉంచింది మధిర నియోజకవర్గ ప్రజలే..
నన్ను ఈ స్థాయిలో ఉంచింది మధిర నియోజకవర్గ ప్రజలే అని డిప్యూటీ సీఎం, ఆర్థిక, ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండల సీతారాంపురం సభలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం లో చెప్పిందే చేస్తాం చేయగలిగేదే చెప్తామన్నారు. నన్ను ఈ స్థాయిలో ఉంచింది మధిర నియోజకవర్గ ప్రజలే అన్నారు. సీతారపురం గ్రామస్థులు చల్లగా ఉండాలన్నారు. అభివృద్ధి పన్నులో నంన్యత పాటించాలి పనుల విషయంలో అధికారులు పర్యవేక్షణ తప్పని సరి అని తెలిపారు. ఇందిరమ్మ రాజ్యాంలో ఆరు గ్యారెంటీలు తప్పక అమలు చేసి తీరుతామన్నారు. రాష్ట్రంలో పేదలకు 2వందల యూనిట్లు విద్యుత్,5వందలకే గ్యాస్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కలిపిస్తున్నాం అన్నారు. పేదల కోసం రూ10 లక్షలతో ఆరోగ్యశ్రీ పథకం అమలు చేస్తున్నామన్నారు. మధిర నియోజకవర్గ ప్రజల ఓటుకు గౌరం తెచ్చే విధంగా పనిచేస్తామన్నారు. రాష్ట్ర ప్రజల కోసం ప్రభుత్వం లో మంత్రులు గా కంకణ బద్ధులై పనిచేస్తున్నామన్నారు. ఉద్యోగులను గత ప్రభుత్వం ఇబ్బందుకు గురిచేసింది.కాంగ్రెస్ ప్రభుత్వం వారిని తిరిగి అదుకుంటుందన్నారు.
నా పాలనలో అభివృద్ధి తప్ప అవినీతి లేదు.. బహిరంగ చర్చలో విజయం నాదే: అనపర్తి ఎమ్మెల్యే
అవినీతిపై బహిరంగ చర్చలో విజయం తనదే అని అనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డి అన్నారు. తన ఐదేళ్ల పాలనలో అభివృద్ధి తప్ప.. అవినీతి లేదన్నారు. చర్చకు వస్తానని చెప్పి టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తోక ముడిచారని సూర్యనారాయణరెడ్డి విమర్శించారు. ఎన్నికల నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డి అవినీతిపరుడు అంటూ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కరపత్రాలు పంచారు. నువ్వు నిరూపించూ అంటూ ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి సవాల్ విసిరారు.
రాష్ట్రంలో మళ్లీ వచ్చేది వైసీపీ ప్రభుత్వమే..
రాష్ట్రంలో మళ్లీ వచ్చేది వైసీపీ ప్రభుత్వమేనని ఆ పార్టీ గిద్దలూరు నియోజకవర్గ సమన్వయకర్త, ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి పేర్కొన్నారు. మండలంలోని బీసీ భవనంలో గురువారం సాయంత్రం నిర్వహించిన వైసీపీ శ్రేణుల ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వైసీపీ మండల అధ్యక్షుడు యేలం మురళీకృష్ణ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డికి 14 పంచాయతీల నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ మాట్లాడుతూ.. నవరత్నాలు పథకాలను కుల, మత, పార్టీలు చూడకుండా అర్హులకు నేరుగా అందించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కిందన్నారు.
ఈ రాష్ట్రంలో అభివృద్ది జరుగుతుంది అంటే మోడీ ప్రభుత్వం వల్లనే
భారత్ జీడీపీ గ్రోత్ 8.4 శాతం ఇది శుభవార్త అన్నారు బీజేపీ నేత కొండ విశ్వేశ్వర్ రెడ్డి. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి మోడీతో మంచి సంబంధాలు పెట్టుకున్నారన్నారు. ఈ ప్రభుత్వం అసెంబ్లీ లో హుందాగా వ్యవహరించింది… బూత్ లు మాట్లాడలేదన్నారు. ఈ రాష్ట్రంలో అభివృద్ది జరుగుతుంది అంటే మోడీ ప్రభుత్వం వల్లనే అన్నారు. ఈ ప్రభుత్వం 9 వేల కోట్లు అప్పులు తెచ్చుకునేందుకు సహకరించిందన్నారు. తెలంగాణ లో కరెంట్, ఇల్లు ,రోడ్లు, అభివృద్ది అన్ని మోడీ వల్లనే అని ఆయన కొనియాడారు. రాహుల్ గాంధీకి ఓటు వెయ్యాలని కాంగ్రెస్ అడగడం లేదు… అసాధ్యమైన పథకాలు కు ఓటు వేయాలని అడుగుతున్నారు… రాహుల్ బాబా కు ఓటు వేయమని ధైర్యం కాంగ్రెస్ కి లేదని, మేము మోడీ కి ఓటు వేయాలని అడుగుతున్నామన్నారు.
కేటీఆర్ ఓడిపోతే కేసీఆర్ పార్టీని మూసేసుకుంటా అని చెప్పాలి
బండి సంజయ్ కి ఏం తెలియదని, ఆయన ని అంత సీరియస్‌గా తీసుకోకండి అంటూ వ్యాఖ్యానించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మా ఆస్తులపై విచారణకి సిద్ధమన్నారు. అంతేకాకుండా.. అవినీతిపరుడైన వ్యక్తి నిజాయితీ గల మీద ఆరోపణలు చేయడం సరికాదని ఆయన హితవు పలికారు. ప్రజాస్వామ్యంలో మోడీ చర్యలు దుర్మార్గమని ఆయన విమర్శించారు. ప్రభుత్వాలు కూల్చడం దుర్మార్గమని, తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీ.. బీఆర్‌ఎస్ ఉండవని ఆయన వ్యాఖ్యానించారు.
బీఆర్‌ఎస్‌కు షాక్.. బీజేపీలో చేరిన జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్
బీఆర్‌ఎస్ పార్టీ భారీ షాక్ తగిలింది. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల వేళ బీఆర్‌ఎస్‌కు చెందిన జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ బీజేపీలో చేరారు. కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సమక్షంలో బీజేపీలో చేరారు బీబీ పాటిల్. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత 2014, 2019 ఎన్నికల్లో బీబీ పాటిల్ బీఆర్‌ఎస్ తరఫున పోటీ చేసి ఎన్నికయ్యారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓటమి అనంతరం పార్టీకి దూరంగా ఉంటున్న బీబీ పాటిల్.. ఇవాళ కేంద్ర మంత్రి సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. గురువారం నాగర్ కర్నూల్ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఉన్న పోతుగంటి రాములు కూడా బీఆర్ఎస్‌ను వీడి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే.