Dr K Laxman: ఏ లేబర్ అడ్డాల మీద చూసినా పాలమూరు బిడ్డలే కనిపిస్తున్నారని బీజేపీ ఎంపీ డా.లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాలమూరు బాగు పడాలంటే బీజేపీతోనే సాధ్యం అవుతుందన్నారు. విజయ సంకల్ప యాత్ర సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ లో డా.లక్ష్మణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 17 పార్లమెంట్ నియోజక వర్గాల్లో విస్తృతంగా విజయ సంకల్ప యాత్ర కొనసాగుతుందన్నారు. గత పది సంవత్సరాలుగా మోది చేసిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించే కార్యక్రమమే ఈ యాత్ర అన్నారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపిన వ్యక్తి మన ప్రధాని మోడీ అన్నారు. బడుగు బలహీన వర్గాల ప్రజల అభివృద్ధికి పాటు పడుతున్న వ్యక్తి ప్రధాని మోడీ అని తెలిపారు. మూడో సారి ప్రధాని కాబోతున్నది కూడా మన నరేంద్ర మోడీనే అన్నారు. మహిళలకు చట్ట సభలో 33శాతం రిజ్వేషన్ కల్పించి మహిళా సాధికారతకు పెంచిన వ్యక్తి మోడీ.. ముస్లిం మహిళలకు ట్రిపుల్ తలాక్ నుండి విముక్తి కల్పించి వారి మనసు గెలిచిన గొప్ప వ్యక్తి మన ప్రధాని అన్నారు. అనేక ఏళ్ల నాటి అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని చేసి చూపిన గొప్ప వ్యక్తి మన ప్రధాని మోడీ అని తెలిపారు.
Read also: Mahalakshmi Scheme: వారికి మాత్రమే రూ.500 గ్యాస్ సిలిండర్.. మహాలక్ష్మి పథకం గైడ్‌లైన్స్..
ఒక పేద కుటుంబం నుండి వచ్చిన వ్యక్తి నరేంద్ర మోడీ అన్నారు. చాయి అమ్ముకున్న స్థాయి నుండి దేశ ప్రధానిగా ఎదిగిన వ్యక్తి మన ప్రధాని మోడీ అన్నారు. పేదరికం నుండి వచ్చాడు కాబట్టే పేద ప్రజలకు అండగా పరిపాలన చేస్తున్న వ్యక్తి మోడీ అన్నారు. ఆయన గొప్పతనం ప్రపంచం మొత్తం చూస్తోందన్నారు. భారత దేశ గొప్పదనాన్ని ప్రపంచానికి తెలిసేలా చేసిన వ్యక్తి మన ప్రధాని అన్నారు. దేశం గర్వించదగ్గ గొప్ప వ్యక్తి.. చిన్న అవినీతి మచ్చ కూడా లేని ప్రధాని అని.. అలాంటి ప్రధాని మోడీ వేసుకునే దుస్తుల గురించి కామెంట్ చేస్తున్నారు కొంత మంది రాజకీయ నేతలు అంటూ మండిపడ్డారు. మోడీ నీ విమర్శించే అర్హత వారికి లేదని మరొక సారి గుర్తు చేస్తున్నా అన్నారు. యూపీఏ హయాంలో 2జి 3జీ స్కాంలు చేసిన చరిత్ర వాళ్ల మంత్రులది అన్నారు. కానీ మోడీ హయాంలో ఒక్క చిన్న అవినీతి మరక లేకుండా ప్రభుత్వం కొనసాగుతుందన్నారు. దేశ వ్యాప్తంగా రోడ్లు, రైల్వే రవాణా సదుపాయాలు ఆధునీకరించి ప్రజలకు సౌకర్యాలు అందించిన ప్రభుత్వం మోడీ ది అన్నారు. ఇప్పుడు పేదలకు నేరుగా కేంద్ర పథకాలు వారి బ్యాంక్ అకౌంట్ కి చేరున్నాయన్నారు. రాజీవ్ గాంధీ హయాంలో దళారీ వ్యవస్థ వల్ల పేదలకు అందాల్సిన పథకాలు మధ్యలోనే మాయమయ్యేవన్నారు.
Read also: Minister Sridhar Babu: కొత్త ప్రభుత్వంపై పెట్టుబడిదారులకు ఉన్న నమ్మకానికి ఇదే నిదర్శనం..
ఇప్పుడు దళారీ వ్యవస్థ లేకుండా చేసి పేద ప్రజలకు అండగా నిలిచింది మోడీ ప్రభుత్వం అన్నారు. 70 సంవత్సారాలు స్వతంత్ర దేశంలో మహిళలు బహిర్ భూమికి వెళ్ళే పరిస్థితి ఉండేదన్నారు. మహిళలను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఇంటికి మరుగు దొడ్ల నిర్మాణానికి నిధులు సమకూర్చిందన్నారు. దేశ వ్యాప్తంగా అర్హులైన పేద వారికి ఉచితంగా రేషన్ ద్వారా బియ్యం అందిస్తుందన్నారు. రైతులకు ఎరువులు ఉచితంగా అందించి వారికి సహకరించి రైతుల పక్షణా నిలిచిందన్నారు. ఏ తల్లులు పొగ గొట్టంతో ఊది వంట చేస్తూ ఇబ్బంది పడకూడదని మన మోది ఉజ్వల పధకం ద్వారా గ్యాస్ సిలిండర్ అందించారన్నారు. గత బిఅర్ఎస్ ప్రభుత్వంలో పాలమూరును దత్తత తీసుకుంటా అని కేసీఆర్ అన్నారని, బొంబాయి బొగ్గుబాయి వలసలు లేకుండా పాలమూరు ను మారుస్తా అని కేసీఆర్ ప్రగాల్బాలు పలికాడన్నారు. గెలిచిన తరువాత పాలమూరు ప్రజలను మోసం చేశాడన్నారు. ఇంకా పాలమూరులో వలసలు కొనసాగుతున్నాయన్నారు. ఏ లేబర్ అడ్డా ల మీద చూసినా పాలమూరు బిడ్డలే కనిపిస్తున్నారని.. అందుకే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ కి పాలమూరు ప్రజలు బుద్ధి చెప్పారని కీలక వ్యాఖ్యలు చేశారు.
Read also: BRS KTR: మార్చి1న చలో మేడిగడ్డ.. తెలంగాణ భవన్ నుంచి 150 మంది బీఆర్‌ఎస్ నేతలు
పాలమూరు బాగు పడాలంటే బిజెపి తోనే సాధ్యం అవుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పాలమూరు ప్రజలను మోసం చేస్తుందన్నారు. ఎన్నికల్లో గెలిచే వరకు ఒకలాగా.. గెలిచిన తరువాత మరోలాగా కాంగ్రెస్ ప్రవర్తిస్తుందన్నారు. ఒడ్దు చేరేవరకు ఓడ మల్లయ్య.. ఒడ్డూ చేరాక బోడ మల్లయ్య అన్నట్టు ఉంది కాంగ్రెస్ సంగతి అన్నారు. ఆరు గ్యారెంటిల పేరిట మభ్య పెట్టిన కాంగ్రెస్.. అది అమలు చేయడానికి మాత్రం వెనుకాడుతుందన్నారు. తెలంగాణ బాగుండాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ కావాలన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణలో కూడా బీజేపీ అధికారం సాధిస్తుందన్నారు. మోడీ గ్యారెంటీ అంటే అది తప్పకుండా నెరవేరుతుందని అర్థం.. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు ఒక్కటే అన్నారు. గతంలో కూడా ఇద్దరూ కలిసి పొత్తు పెట్టుకున్న చరిత్ర వాళ్ళదన్నారు. రెండు పార్టీలు కలిసి తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నాయన్నారు. 17 పార్లమెంట్ స్థానాల్లో ఒంటరిగానే బీజేపీ పోటీ చేస్తుందన్నారు. ఖచ్చితంగా మెజారిటీ స్థానాలు సాధించడమే బీజేపీ లక్ష్యమన్నారు. ఈ సారి ఓవైసీ కోటను కూడా బద్దలు కొట్టి హైదరాబాద్ పార్లమెంట్ లో బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
Ponnam Prabhakar: ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు.. బండి సంజయ్ పై పొన్నం ఫైర్