బీఆర్ఎస్ పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్ నేతలు మేడిగడ్డ సందర్శనకు పోవాలి.. క్షమాపణ చెప్పాలని అన్నారు. చీఫ్ ఇంజనీర్ కేసీఆర్ పోయి చూసి.. ప్రజలకు క్షమాపణ చెప్తే బాగుంటుందని ఆరోపించారు. అధికారులకు ఆదేశాలు ఇచ్చాం.. బీఆర్ఎస్ వాళ్లకు అన్నీ చూపెట్టమని అని తెలిపారు. కాళేశ్వరంపై పెద్ద ఫ్రాడ్ చేసి.. ఉల్టా తమపై ఆరోపణలు చేయడం దుర్మార్గం అని పేర్కొన్నారు.
CM Revanth: ఓఆర్ఆర్ టోల్ టెండర్లలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణకు సీఎం ఆదేశం..
బీఆర్ఎస్ కమిషన్ల కోసమే ప్రాజెక్టులు కట్టారని మంత్రి ఉత్తమ్ కుమార్ ఆరోపించారు. ప్రాజెక్టు పూర్తి అవ్వాలంటే.. రూ.లక్ష 47 వేల కోట్లు అవుతాయని తెలిపారు. బీఆర్ఎస్ రాజకీయంగా ట్విస్ట్ చేయాలి అని చూస్తుందని తెలిపారు. లక్ష కోట్లు ఖర్చు చేసి కట్టిన ప్రాజెక్టు కింద లక్ష ఎకరాలు కూడా కొత్త ఆయకట్టు లేదని విమర్శించారు. మేడిగడ్డ కుంగినప్పుడు సీఎంగా కేసీఆర్ ఎందుకు స్పందించలేదని మంత్రి ప్రశ్నించారు.
మేడిగడ్డ రిపేర్ గురించి అప్పుడు కేసీఆర్ ఎందుకు మాట్లాడలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ దుయ్యబట్టారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి విచారణ అప్పగించాం.. NDSAకి త్వరగా నివేదిక ఇవ్వండి అని కోరామన్నారు. ఇరిగేషన్ పై విజిలెన్స్ రిపోర్ట్ అందింది.. విజిలెన్స్ రిపోర్ట్ పై న్యాయ సలహాలు తీసుకుంటామని చెప్పారు. లీగల్ ఒపియన్ తీసుకున్నాక చట్టపరమైన చర్యలు ఉంటాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.