Pushpa Leela: కవిత దిక్కుమాలిన సలహాలు తీసుకొనే కర్మ కాంగ్రెస్‌కి పట్టలేదు: పుష్ప లీల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత దిక్కుమాలిన సలహాలు తీసుకొనే కర్మ కాంగ్రెస్‌కి పట్టలేదు అని మాజీ మంత్రి పుష్ప లీల విమర్శించారు. స్త్రీ సమానత్వం గురించి మాట్లాడే నైతిక అర్హత కవితకి లేదని, కాంగ్రెస్‌ను ప్రశ్నించే హక్కు అస్సలే లేదని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డిని ప్రశించటానికి ఉద్యమం చేస్తున్నట్టు లిక్కర్ రాణి ఫీల్ అవుతుందని ఎద్దేవా చేశారు. రైతులకి లేని అవకాశం ధర్నా చేయటానికి కవితకి ఒక్క రోజులో ఎలా దొరికింది? అని పుష్ప లీల ప్రశ్నించారు.
శనివారం గాంధీ భవన్‌లో మాజీ మంత్రి పుష్ప లీల మాట్లాడుతూ… ’10 సంవత్సరాలు ప్రజల గురించి పట్టించుకోని కవితకు.. స్త్రీ సమానత్వం గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు. కాంగ్రెస్‌ను ప్రశ్నించే హక్కు అస్సలే లేదు. రేవంత్ రెడ్డిని ప్రశించటానికి ఉద్యమం చేస్తున్నట్టు లిక్కర్ రాణి ఫీల్ అవుతుంది. కవిత దిక్కుమాలిన సలహాలు తీసుకొనే కర్మ కాంగ్రెస్‌కి పట్టలేదు. ట్రైబల్, అసైన్మెంట్ చట్టంలో స్త్రీకి గౌరవం ఇచ్చింది ఇందిరా గాంధీ. కేసీఆర్ లాంటి ద్రోహి బిడ్డవి నువ్వు. కేటీఆర్‌ని మించిపోయావ్. కొంగ దొంగ జపం లాగా.. మహాశివ రాత్రి రోజు నీ అబద్దాల ధర్నా ఉంది’ అని విమర్శించారు.
Also Read
- Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
- IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
- Shami-Siraj: భువనేశ్వర్ కుమార్ రీ-ఎంట్రీ.. షమీ, సిరాజ్‌లకు బీసీసీఐ క్లియర్ మెసేజ్..!
- Donald Trump: నేనేమీ డబ్బా కొట్టుకోవట్లేదు.. నిజాలే చెప్తున్నా.. నోబెల్ శాంతి బహుమతి నాకే రావాలి..
Also Read: PM Modi: నరేంద్ర మోడీ కనికరంలేని రాజకీయ నాయకుడు: కూనంనేని సాంబశివరావు
‘జీవో నో3 హై కోర్టులో వేసాను అంటాడు కేసీఆర్. సోనియా గాంధీ బిక్ష వల్ల మీ ఫ్యామిలీకి రాజకీయ జీవితం వచ్చింది. రైతులకి లేని అవకాశం ధర్నా చేయటానికి కవితకి ఒక్క రోజులో ఎలా దొరికింది. బీజేపీ, బీఆర్‌ఎస్ ఒక్కటే అనడానికి ఇదే ఓ నిదర్శనం. ట్రైబల్, బీసీ, ఎస్సీ మహిళలకి చదువుకోవడం కోసం కల్పించిన అవకాశం అది. సమాన అవకాశాలూ గత పదేళ్లలో కవితకి ఎందుకు గుర్తుకు రాలేదు. లిక్కర్ కేసులో ఎక్కడ అరెస్ట్ చేస్తారేమో అని కవిత రోజు ప్రజల్లోకి వస్తుంది, డ్రామాలు ఆడుతుంది. లోకసభ ఎన్నికలలో దొంగ మాటలు మాట్లాడే బీఆర్‌ఎస్ కి మహిళలు బుద్ధి చెప్తారు’ అని పుష్ప లీల అన్నారు.
తాజావార్తలు
-
Starlink India Row: ‘మార్కెట్ గుత్తాధిపత్యం కోసమే అడ్డుకుంటున్నారు’.. Starlink Indiaపై ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు
-
Nana Patekar Dies: బాలీవుడ్ నటుడు నానా పటేకర్ కన్నుమూత.. గోవా నివాసంలో అపస్మారక స్థితిలో..!
-
NBK DADA : సెట్స్‌లో అడుగుపెట్టిన సింహం.. క్రిస్ట’మాస్’ చూపించబోతున్నారు
-
MG Hector Blackstorm: MG హెక్టర్ బ్లాక్‌స్టార్మ్, స్నోస్టార్మ్ ఎడిషన్స్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
ట్రెండింగ్
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!