ఇందిరా పార్కు వద్ద భారత్ జాగృతి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత చేపట్టిన దీక్ష ముగిసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చరిత్రలో మహిళలతో పెట్టుకున్న వారు ఎవరు బాగుపడలేదని అన్నారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళల వాటా మహిళకు రావాలని కవిత కోరారు. గత ప్రభుత్వం అమలు చేసిన రిజర్వేషన్లు అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులకు ఇచ్చిన మాట తప్పారని దుయ్యబట్టారు. తమ ప్రభుత్వ హయాంలో ఒక అమ్మాయి చనిపోతే రాజకీయానికి వాడుకున్నారని మండిపడ్డారు.
Read Also: Vizag: నిరుద్యోగులకు ప్రేమజంట కుచ్చుటోపి.. అరెస్ట్ చేసిన పోలీసులు
కోర్టు తీర్పు పేరు చెప్పి రేవంత్ రెడ్డి తప్పించుకున్నారని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవో 3 నిజమైతే 30 వేల ఉద్యోగాల్లో ఎంత రిజర్వేషన్లు అమలు చేశారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కవిత ప్రశ్నించారు. ఈ ప్రభుత్వంలో నిరుద్యోగులు కన్ఫ్యుజ్ లో ఉన్నారని.. నిరుద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని ఆమె కోరారు. కర్ణాటక తరహలో అమలు చేస్తున్న రిజ్వేషన్లు అమలు చేస్తున్నపుడు తెలంగాణకు ఎందుకు వర్తించదని ప్రశ్నించారు. హారిజాంటల్ పద్దతిలో రిజర్వేషన్ పద్ధతి అమలు చేయాలని కోరారు. మా పోరాటం మహిళలకే కానీ పురుషులకు అన్యాయం చేయాలని కాదని కవిత పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి మూన్నెళ్ళ ముఖ్యమంత్రి అని విమర్శించారు. రేవంత్ రెడ్డి రేసు గుర్రం కాదు.. గుడ్డి గుర్రం అని దుయ్యబట్టారు.
Read Also: Butter chicken: “బటర్ చికెన్” వ్యక్తి ప్రాణం తీసింది..