Jagadish Reddy: ఎమ్మెల్సీ కవిత కేస్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తన దగ్గర ఆధారాలు ఉన్నాయి అంటున్నారు.. ఈడీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ని కూడా విచారణ చేయాలని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సంచలన వ్యాక్యలు చేశారు.
BRS KTR: కుట్రపూరితంగా అసత్యాలను ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానళ్లపై క్రిమినల్ కేసులు పెడతామని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు.
గ్రేటర్ హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి కూడా కారు దిగేస్తారా? ఆమె పార్టీ మారిపోవడం ఖాయమైనట్టేనా? అదే నిజమైతే బీఆర్ఎస్ ముఖ్య నేత కే.కేశవరావు పరిస్థితి ఏంటి? తనకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చిన కేసీఆర్కు హ్యాండిస్తారా? లేక తండ్రీ కూతుళ్లు చెరో పార్టీలో ఉంటారా? మేయర్ పార్టీ మార్పు కేంద్రంగా జరుగుతున్న రాజకీయం ఏంటి? వలస నేతల కోసం తెలంగాణ కాంగ్రెస్ గేట్లు తెరిచాక బీఆర్ఎస్ కారుకు కుదుపులు పెరిగిపోతున్నాయి. పార్టీ ఎమ్మెల్యేలతో పాటు కొందరు బడా నేతలు…
పది సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్కు స్థానిక అభ్యర్థి దొరకకపోవడం బాధాకరమని బీజేపీ మెదక్ పార్లమెంటరీ అభ్యర్థి రఘునందన్ రావు వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మర్కుక్ మండల కేంద్రంలోని రంగనాయకస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ… బీఆర్ఎస్ పార్టీకి మెదక్లో ఒక్క స్థానిక అభ్యర్థి దొరకకపోవడం విడ్డూరమన్నారు. అలా అయితే బీఆర్ఎస్ పార్టీ దుకాణాన్ని బంద్ చేసుకోవాలని ఎద్దేవా చేశారు. మెదక్ సీటును ఆ పార్టీ ఇతర ప్రాంతాల వారికి అమ్ముకున్నదని ఆరోపించారు.…
బీఅర్ఎస్ విద్యుత్ కొనుగోళ్లలో భారీ అవినీతికి పాల్పడిందన్నారు ఎంపీ డాక్టర్ లక్ష్మణ్. ఇవాళ ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయం మాట్లాడుతూ.. ఎన్టీపీసీలో చవకగా వచ్చే విద్యుత్తును కాదని కమీషన్ కోసమే ఇతర సంస్థల నుంచి బీఅర్ఎస్ విద్యుత్ కొనుగోలు చేసిందన్నారు. గతంలో బీఅర్ఎస్ విద్యుత్ అవినీతిపై రేవంత్ ఆరోపణలు చేశాడన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారం చేపట్టాక రేవంత్ ఎందుకు స్పందించడం లేదని, ఎన్టీపీసీ తో ppl కుదుర్చుకోవడానికి కాంగ్రెస్ ముందుకి ఎందుకు రావడం లేదు? అని ఆయన…
Manda Krishna Madiga: కడియం శ్రీహరి వల్లే..రాజయ్యను బీఆర్ఎస్ బర్తరఫ్ చేసిందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ సంచలన వ్యాఖ్యలు చేశారు. వరంగల్ బిడ్డగా.. వరంగల్ జిల్లాకు చెందిన వాడిగా.. వరంగల్ రాజకీయాల గురించి మాట్లాడుతానని అన్నారు. కడియం శ్రీహరి ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాదిగలను రాజకీయంగా ఎదుగుదకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు. 40 ఏళ్లుగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కడియం శ్రీహరి మాదిగ అని చెప్తూ రాజకీయంగా ఎదుగుతూ వచ్చారన్నారు. మాదిగ సామాజివర్గానికి చెందిన రాజకీయ నాయకులను…