Vivek Venkatswamy: తెలంగాణ ఏర్పాటుతో కేవలం కల్వకుంట్ల కుటుంబం మాత్రమే లాభ పడిందిని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జిగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ కలిసారు. అనంతరం వివేక్ మాట్లాడుతూ… నిజామాబాదు ఎంపీ అభ్యర్థి గా జీవన్ రెడ్డి ని ప్రకటించడం హర్షనీయమన్నారు. వచ్చే ఎన్నికల్లో 15 సీట్లు గెలవడం ఖాయమన్నారు. సీఎం రేవంత్ ఇచ్చిన మాట ప్రకారం మూడు నెలల్లో 5గ్యారంటీ లు అమలు చేసారని పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం దృష్టిలో ఉంచుకొని సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కార్ ముందుకు వెళ్తున్నారని తెలిపారు. కమిషన్లు కొరకే కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయం పెంచారన్నారు. కాంట్రాక్టర్ ఎలాక్టోరల్ బాండ్స్ ద్వారా బీఆర్ఎస్ పార్టీకి ఇవ్వడం జరిగిందన్నారు. ఎన్ఫోర్స్ మెంట్ కేస్ లు పెట్టి విచారణ చేయాలనీ డిమాండ్ చేస్తున్నామన్నారు. 10 సంవత్సరాలనుండి అహంకార ధోరణితో పాలించారన్నారు.
Read also: Aadujeevitham – The Goat Life Review: ది గోట్ లైఫ్- ఆడు జీవితం రివ్యూ
రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ చేసి చట్టాన్ని అతిక్రమించారని మండిపడ్డారు. చట్ట విరుద్ధంగా ఫోన్ ట్యాపింగ్ ఏక్విప్మెంట్ తీసుకువచ్చారని తెలిపారు. కేంద్రం ఈ విషయాన్నీ విచారణకి అదేశించాలని డిమాండ్ చేశారు. ప్రజలు చూస్తున్న ప్రజా పాలన రాష్ట్రంలో కొనసాగుతుందన్నారు. రాష్ట్రంలో ప్రజలకు స్వేచ్ఛ వచ్చిందని తెలిపారు. ఒకప్పుడు ఎమ్మెల్యేలు సీఎంను కలిసే అవకాశం లేకపోయేదన్నారు.. కానీ కాంగ్రెస్ ప్రజా పాలనలో ప్రజలు సెక్రటేరియట్ కు వచ్చి సమస్యలు చెప్పుకుంటున్నారని తెలిపారు. తెలంగాణ ఏర్పాటుతో కేవలం కల్వకుంట్ల కుటుంబం మాత్రమే లాభ పడిందన్నారు. వేల కోట్ల రూపాయలు లిక్కర్ స్కామ్ ద్వారా కవిత ఆమె కుటుంబం లబ్ది పొందిందన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీట్ వచ్చే అవకాశం లేదన్నారు.
MLC Jeevan Reddy: బీజేపీ, కాంగ్రెస్ రెండింటిని పోల్చుకుని ప్రజలు ఓట్లు వేయండి..