Kunamneni Sambashiva Rao: కాంగ్రెస్ ని ఎంపీ సీట్లు అడుగుతున్నామని, పోటీ చేయాలని అడుగుతున్న సీట్ల వివరాలు కాంగ్రెస్ కి ఇచ్చామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనమనేని సాంబశివరావు అన్నారు.
ఇవాళ (గురువారం) ముథోల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్రెడ్డి హస్తం గూటికి చేరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో మంత్రి సీతక్క విఠల్ రెడ్డికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించింది.
నేడు డీసీసీబీ చైర్మన్ బల పరీక్ష జరగనుంది. వైస్ చైర్మన్ సహా మెజార్టీ సభ్యుల తిరుగుబాటు చేశారు. అవిశ్వాస పరీక్షకు ముందు డీసీసీబీ చైర్మన్ భాస్కర్ రెడ్డి రాజీనామా చేశారు.
బీఆర్ఎస్లో అభ్యర్థుల్ని ప్రకటించకుండా మిగిలిపోయిన సీట్ల సంగతి ఏంటి? కవిత అరెస్ట్ తర్వాత పార్టీలో పరిస్థితి ఎలా మారిపోయింది? ఆ ఐదు సీట్లకు అభ్యర్థులు ఖరారయ్యేది ఎన్నడు? అర్ధంతరంగా ఆగిపోయిన పార్లమెంట్ నియోజకవర్గాల రివ్యూల సంగతి ఇక అంతేనా? లోక్సభ ఎన్నికల విషయంమై పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం తర్వాత తత్వం బోధపడ్డ బీఆర్ఎస్ అధిష్టానం… రివ్యూ మీటింగ్స్ పెట్టింది. నాడు ఓడిపోవడానికి కారణాలపై పోస్ట్మార్టంతో పాటు… లోక్సభ ఎన్నికల్లో తీసుకోవాల్సిన…
ప్రభుత్వమే ధాన్యాన్ని కొనుగోలు చేస్తుంది.. ప్రభుత్వమే ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని రాష్ట్ర రోడ్డు రవాణా భవనాలు, సినీమాటోగ్రాఫి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఇవాళ నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలంలో ఆయన పర్యటించారు. గూడూరు, వెంకటాద్రిపాలెం గ్రామాలలో నూతనంగా నిర్మించిన ఆలయాలలో విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అకాల వర్షాలతో జరిగిన పంట నష్టాన్ని అంచనా వేసి రైతులకు నష్టపరిహారం అందిస్తామన్నారు. ధాన్యానికి రైస్ మిల్లర్స్ మద్దతు ధర చెల్లించకుంటే మిల్లులను సీజ్…
Swarna Sudhakar Reddy: బీఆర్ఎస్కు మరో షాక్ తగిలింది. మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి బీఆర్ ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
Errabelli Dayakar Rao: బీఆర్ఎస్ లోనే ఉంటాను.. నేను పార్టీ మారడం లేదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు క్లారిటీ ఇచ్చారు. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీఆర్ఎస్ నుంచి బీజేపీ లోకి వలసలు పర్వం కొనసాగుతుంది.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ పై ఈడీ సోమవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 15వ తేదీన కవితను అరెస్ట్ చేశామని.. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో కవితను అరెస్ట్ చేసినట్లు పేర్కొంది. ఢిల్లీ ప్రత్యేక కోర్టు కవితను ఏడు రోజుల కస్టడీకి అనుమతించిందని తెలిపారు. ఈ నెల 23వ తేదీ వరకు కవిత ఈడీ కస్టడీలో ఉంటుందని పేర్కొంది. కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నామని తెలిపింది.
బీఆర్ఎస్ పై పరిగి ఎమ్మెల్యే రాంమోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ తీరు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని విమర్శించారు. పదేళ్ల పాటు విచ్చలవిడిగా ఫిరాయింపులను ప్రోత్సహించింది కేసీఆర్ కాదా..? అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్, టీడీపీ, బీఎస్పీ చివరకు సీపీఐ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకోలేదా..? అని మండిపడ్డారు. తెలంగాణ పునర్ నిర్మాణం పేరుతో శాసనసభ్యులను చేర్చుకున్నది మీరు కాదా..? పదేళ్లలో ఇతర పార్టీల నుంచి మొత్తం 39…