Ex MLA Aroori Ramesh: వరంగల్ లో ఆసక్తికర రాజకీయాలు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో నిన్న మొన్నటి వరకు ఓ వెలుగు వెలిగిన బీఆర్ఎస్ పార్టీలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలు కలచివేస్తున్నాయి.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. లోక్సభ ఎన్నికల్ల పోటీ చేసే మరో ఇద్దరు బీఆర్ఎస్ అభ్యర్థుల పేర్లను మాజీ సీఎం కేసీఆర్ ప్రకటించారు. చేవెళ్ల నుంచి కాసాని జ్ఞానేశ్వర్, వరంగల్ ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ కడియం కావ్య పేరును ప్రకటించారు.
ఒక్క పన్ను పాడైతే అన్ని పీకేసుకుంటామా, ఎన్నికల్లో ప్రజలు అత్యాశకు పోయారని, ముఖ్యమంత్రి భాషపైన నిన్నటి కరీంనగర్ సభలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు.
వరంగల్ పార్లమెంట్ బీఆర్ఎస్ నేతలతో ఆ పార్టీ అధినేత కేసీఆర్ భేటీ అయ్యారు. ఇవాళ వరంగల్ నియోజకర్గం పార్లమెంట్ అభ్యర్థిని ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పార్టీ మారతున్నారనే వార్తల నేపథ్యంలో ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉండగా.. ఆరూరి రమేష్ పార్టీ మార్పుపై ఉదయం నుంచి వరంగల్లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై తీవ్రంగా విరుచుకుపడ్డారు బీజేపీ ఎంపీ బండి సంజయ్. తెలంగాణ సమాజం చీదరించుకుని ఓడగొట్టినా కేసీఆర్కు బుద్ధిలేదంటూ ఆయన వ్యాఖ్యానించారు. అబద్దాలు మాట్లాడుతూ ప్రజలని మళ్లీ మోసగిస్తున్నారని ఆయన విమర్శించారు. మళ్లీ మాయ మాటలతో తెలంగాణ సెంటిమెంట్ని రగిలించే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
Etela Rajender: నేను చేరింది రైటిస్ట్ పార్టీలో కాదు రాజకీయ పార్టీలో అని మల్కాజిగిరి పార్లమెంట్ మల్కాజ్గిరి బిజెపి ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రంగారెడ్డి జిల్లాలో ఆయన మాట్లాడుతూ..
BRS Aroori Ramesh: హనుమకొండలోని మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఇంటి వద్ద పొలిటికల్ హైడ్రామా నడిచింది. బీఆర్ఎస్ కు రాజీనామా చేస్తానంటూ ఆరూరి రమేష్ ప్రకటించిన విషయం తెలిసిందే..
Dr K Laxman: సీఎం రేవంత్ రెడ్డి పై బీజేపీ ఎంపీ డా.లక్ష్మణ్ మరోసారి స్పందించారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు, పేద వర్గాలను చూస్తుంటే జాలి కలుగుతుందన్నారు.
కరీంనగర్ జిల్లా కదనభేరి సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా వచ్చి బాధ పెట్టినా, ఖజానాలో డబ్బు లేకున్నా రైతుబంధు ఇచ్చామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఇవ్వలేకపోతున్నారని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఎంత బలంగా గులాబీ జెండా ఎగిరితే అంత బలంగా తాము అభివృద్ధిపై పోరాడుతామని తెలిపారు. చట్టం ప్రకారం జిల్లాకో నవోదయ ఇవ్వాల్సి ఉన్నా.. ఒక్క నవోదయ పాఠశాల ఇవ్వని బీజేపీకి…