MLA Raja Singh: గోషామహాల్ ఎమ్మేల్యే రాజాసింగ్ హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. సాయంత్రం నాలుగు గంటలకు చెంగిచర్లకు వెళ్తానని రాజాసింగ్ ప్రకటించడంతో పోలీసులు ఆయన్ను హౌస్ అరెస్ట్ చేశారు. చెంగిచర్లకు వెళ్ళవద్దు అంటూ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. హోళీ పండుగ రోజు చెంగిచెర్లలో హిందువులపై దాడి జరిగిందన్నారు. ఈ దాడిలో చాలా మంది మహిళలు, యువత గాయపడ్డారన్నారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. దాడికి గురైన వారిపై ఎట్లా కేసు నమోదు చేస్తారన్నారు. చెంగిచెర్లకు వెళ్లి బాధితులను పరామర్శించేందుకు వెళ్తుంటే పోలీసులు అడ్డుకుని హౌస్ అరెస్ట్ చేయడం ఏమిటీ ? అని ప్రశ్నించారు. ఎనిమిదో నిజామైన కేసీఆర్ హయాంలో హిందువులపై దాడి జరిగిందన్నారు.
Read also: Lemons: దేవుడా.. 9 నిమ్మకాయలు కేవలం రెండున్నర లక్షలే.. అసలు అంతలా ఏముంది వాటిలో..?!
రేవంత్ రెడ్డి హయాంలోనూ హిందువులపై దాడి జరిగిందన్నారు. హిందువులపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకోమన్నారు. హిందువులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నా అని రాజాసింగ్ డిమాండ్ చేశారు. గాయపడి హిందూ మహిళను పరామర్శించేందుకు వెళితే అడ్డుకోవడం కరెక్ట్ కాదని మండిపడ్డారు. హిందూ మహిళకు న్యాయం జరిగేంత వరకు పోరాడతామని తెలిపారు. అయితే ఈరోజు సాయంత్రం రాజాసింగ్ చెంగిచర్లకు వెళ్తారా? లేదా? అనే దానిపై ఉత్కంఠగా మారింది.
Om Bheem Bush: వసూళ్ల సునామీ సృష్టిస్తున్న శ్రీవిష్ణు మూవీ.. ఎన్ని కోట్లంటే?