కేటీఆర్‌కి ఎంతో తెలుసు అనుకున్నా.. నీ పార్టీ పెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు బీసీ నాయకుడు అధ్యక్షుడు అయ్యాడా అని ప్రశ్నించారు మంత్రి పొన్నం ప్రభాకర్. కేసీఆర్ సీఎం అయ్యాకా అయినా.. బీసీ కి ఇవ్వచ్చు కదా అని మంత్రి పొన్నం వ్యాఖ్యానించారు. ప్రతిపక్షంలో ఉన్నా.. అధ్యక్షుడు మీరే.. ఫ్లోర్ లీడర్ మీరే.. ఎన్నికల ముందు బీసీ లకు మీ పార్టీ పదవి ఇవ్వండని ఆయన అన్నారు. మీరు బలహీన వర్గాలకు ఇచ్చిన నిధులు ఏంటో చర్చకు సిద్ధమా..? అని కేటీర్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు. బీజేపీ బీసీ అధ్యక్షుడు ని తీసేసి.. ప్రతిపక్ష నేత పదవి కూడా బీసీలకు ఇవ్వలేదన్నారు. బీసీ అధ్యక్షుడిని ఎందుకు తొలగించారు అంటే బండి సంజయ్ వర్గం.. కేసీఆర్ ఇప్పొంచాడు కిషన్ రెడ్డికి అంటారని, మాకు నీతులు చెప్పే ముందు.. నీ పార్టీలో అయినా పదవులు ఇవ్వు కేటీఆర్ పొన్నం ప్రభాకర్ అన్నారు. మహేశ్వర్ రెడ్డి మాటలు.. పాడిందే పాట అనే సామెత లెక్క ఉందన్నారు. మా ప్రభుత్వాన్ని టచ్ చేసి చూడమని, మహేశ్వర్ రెడ్డి జోతిష్యం చదవలేదన్నారు పొన్నం ప్రభాకర్.
బీసీలకు కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తోందన్నారు. అదే బీసీల గురించి బీఆర్ఎస్‌లో అడిగే పరిస్థితి ఉందా? అని నిలదీశారు. పార్టీ పెట్టినప్పటి నుంచి కేసీఆర్ తప్ప ఎవరైనా అధ్యక్షుడిగా ఉన్నారా? అని ప్రశ్నించారు. పార్టీ అధికారంలో ఉన్నా… ప్రతిపక్షంలో ఉన్నా… ఫ్లర్ లీడర్, అధ్యక్ష పదవి అన్నీ వారికేనని విమర్శించారు. కనీసం కేసీఆర్ సీఎం అయినప్పుడు అయినా బీసీకి పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చి ఉండవచ్చు కదా అని ప్రశ్నించారు. ఇప్పుడైనా ఎన్నికలకు ముందు బీసీలకు మీ పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వాలని సూచించారు. కేటీఆర్‌కు చాలా తెలుసనుకున్నానని.. కానీ ఏమీ తెలియదన్నారు.