BRS KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి రూ.2500 కోట్లు వసూలు చేసి కాంగ్రెస్ పెద్దలకు పంపాడు అంటూ వ్యాఖ్యలుపై కాంగ్రెస్ నేత బత్తిన శ్రీనివాస్ రావు కేటీఆర్ పై ఫిర్యాదు చేశారు. హనుమకొండ పోలీస్టేషనల్ లో కేసు నమోదు చేసి బంజారా హిల్స్ పోలీసులు పంపారు. ఐపీసీ 504,505(2) సెక్షన్ల కింద బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Read also: Tillu Square Collections : బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల సునామి సృష్టిస్తున్న ‘టిల్లు – లిల్లి’..!
తాజాగా.. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గం సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. మున్సిపల్ శాఖను తన ఆధీనంలో ఉంచుకున్న సీఎం రేవంత్ రెడ్డి మూడు నెలలు చెల్లిస్తేనే భవనాలకు అనుమతులు ఇస్తున్నారని, వసూలు చేసిన రూ.2,500 కోట్లు ఢిల్లీకి పంపించారని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. పేగులు కోసుకుని మెడలో వేసుకుంటానని అడ్డగోలుగా మాట్లాడుతున్న రేవంత్ కు సీఎంగా పని చేసేంత తెలివి లేదని కేటీఆర్ విమర్శించారు.
Read also: Pawan Kalyan Pithapuram Tour: జనసేనాని పిఠాపురం పర్యటనలో స్వల్ప మార్పులు..
ఫోన్ ట్యాపింగ్, మోసాల పేరుతో మీడియాలో రాద్దాంతం చేస్తున్నారని, పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన తొలి వ్యక్తి రేవంత్ రెడ్డి అని కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ ఆరోపణలపై ఎందుకు స్పందించడం లేదని సమావేశంలో ప్రశ్నించారు. జీవితాంతం కాంగ్రెస్‌లోనే ఉంటానని రేవంత్ రెడ్డి ఎప్పుడూ చెప్పలేదని, అది నిజమే కాబట్టి బీజేపీలో చేరడంపై మాట్లాడడం లేదని ఆరోపించారు. ఆయన చేసిన ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీతో పాటు సీఎం పరువు, బాధ్యతలకు భంగం కలిగేలా మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నేతలు హనుమకొండ పీఎస్‌లో ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆఫిర్యాదును హనుమకొండ పోలీసులు బంజారాహిల్స్ పోలీసులకు పంపారు. నిరాధార ఆరోపణలు చేస్తున్న మాజీ మంత్రి కేటీఆర్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో కేటీఆర్‌పై జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. మరి కేటీఆర్ పై ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనే దానిపై ఉత్కంఠంగా మారింది.
Delhi Liquor Policy: లిక్కర్ స్కాం కేసులో మరో ఆప్ మంత్రికి ఈడీ నోటీసులు..