Gadwal Vijayalakshmi: లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లోకి వలసలు జోరందుకున్నాయి.బీఆర్ఎస్ కీలక నేతలు ఒక్కొక్కరుగా కారు దిగుతున్నారు. ఇప్పటికే పలువురు నేతలు పార్టీకి గుడ్ బై చెప్పారు. తాజాగా జీహెచ్‌ఎంసీ మేయర్ విజయలక్ష్మి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఆమె కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్ మున్షీ, పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. విజయలక్ష్మి తండ్రి, రాజ్యసభ సభ్యుడు కె.కేశరావు కూడా బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. నిన్న రేవంత్ రెడ్డిని కలిశారు. తన రాజకీయ జీవితం కాంగ్రెస్ తోనే ప్రారంభమైందని, నాలుగు దశాబ్దాలు కాంగ్రెస్ లోనే ఉన్నానని అన్నారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కడియం శ్రీహరి కూడా కాంగ్రెస్‌లో చేరనున్నారు.
Read also: Lanka Dinakar: రాష్ట్రానికి రూ.2 లక్షల కోట్లు కేంద్రం నుంచి వచ్చినవే.. కాదని చెప్పే ధైర్యం ఉందా?
తాజాగా ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్‌ఎస్‌కు భారీ షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ ఈరోజు కాంగ్రెస్‌లో చేరారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపాస్ మున్షీకి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పురాణం సతీష్ కాంగ్రెస్ లో చేరడంలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ కీలక పాత్ర పోషించారు. పురాణం సతీష్ మాట్లాడుతూ.. ఉద్యమ కాలం నుంచి కేసీఆర్ వెంటే ఉన్నామన్నారు. బీఆర్‌ఎస్ పాలనలో రాష్ట్రం స్తంభించిపోయిందన్నారు. బిఆర్‌ఎస్ ఇంతకాలం బానిస సంకెళ్లలో కూరుకుపోయిందని ఆరోపించారు. కేసీఆర్ చెప్పేవన్నీ అబద్ధాలేనని విమర్శించారు. తెలంగాణ సంపదను దోచుకున్నారని ధ్వజమెత్తారు. యాదాద్రిలోనూ 400 కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపించారు. రేవంత్ నాయకత్వంలో రాష్ట్రం ముందుకు సాగుతుందని కొనియాడారు. ఆరు హామీలతో ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు. కేటీఆర్, హరీష్ రావు తెలంగాణ ప్రజలను పిచ్చివాళ్లని చేశారని విమర్శించారు.
Bharat Ratna : భారతరత్న అవార్డు అందుకున్న పీవీ తనయుడు ప్రభాకర్ రావు