బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ సీనియర్ నాయకులు రాష్ట్ర డీజీపీని కలిశారు. నిన్న తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడి ఘటనపై ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో బాంబుల సంస్కృతి తిరిగి తీసుకువస్తున్నారన్న నాయకులు మండిపడ్డారు. పోలీసుల స్వయంగా ధర్నా శిబిరం పైన దాడి చేయడం టెంట్ పీకి వేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చాక అరాచక పాలన…
గత కొద్దిరోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు తెలంగాణ ప్రజలకు నష్టం చేకూరేలా ఉన్నాయని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలతోపాటు 420 హామీల అమలు కోసం రాష్ట్ర ప్రజలంతా గంపెడాశతో ఎదురు చూస్తున్నారని, ముఖ్యంగా రైతులందరికీ రుణమాఫీ చేశామని ప్రభుత్వం చెబుతున్న మాటలకు క్షేత్ర స్థాయిలో అమలైన తీరుకు పొంతనే లేదన్నారు. నూటికి 70 శాతం మంది రైతులు రుణమాఫీ అందక తీవ్ర…
Big Breaking: తిరుమలగిరిలో ఉద్రికత్త పరిస్థితి నెలకొంది. బీఅర్ఎస్, కాంగ్రెస్ నేతలు రాళ్ళ డాడి చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీసింది. రుణమాఫీపై బీఆర్ఎస్ ధర్నా చేస్తుండగా..
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వినయ పూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నానని.. అధికారం కోసం, అధికారం కోల్పాయి కొద్ది మంది దుర్బుద్ధితో రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రుణమాఫీ అంశంలో ప్రస్తుతం అధికార-ప్రతిపక్షాల మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధంపై ఆయన స్పందించారు.
గత పది సంవత్సరాలు అభివృద్ధి కార్యక్రమాలు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డామని.. ఇందిరమ్మ రాజ్యంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. నిమిషం కూడా వృథా చేయమన్నారు. ఎర్రుపాలెం మండలం జములాపురంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడారు.
ఇప్పటి సీఎం అప్పటి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి జన్వాడ ఫామ్ హౌస్ పోతే డ్రోన్లు ఎగురవేశారని కేసులు పెట్టారని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ఇప్పుడెందుకు కేటీఆర్ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారన్నారు. ఆయన మరి ఆ రోజే ఫామ్ హౌస్ నాది కాదని కేటీఆర్ చెబితే అయిపోవు కదా?.. కానీ ఇప్పుడు ఇతరుల పేరుపై మార్చి నాది కాదు అంటే ఎలా? అని ప్రశ్నించారు.
కేటీఆర్.. జన్వాడ ఫాం హౌస్ నాది కాదంటారు..? మిత్రున్ని కోర్టుకు పంపించారు.. అక్రమ నిర్మాణం కూల్చాలి అంటారు.. ఇంకో పక్క కోర్టులో స్టేకి వెళ్ళారని ఎంపీ చామల కిరణ్ అన్నారు. కేటీఆర్ పక్కన ఉండే చిల్లర మనుషులు మార్ఫింగ్ ఫోటోలతో సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని.. ఎఫ్టీఎల్ పరిధిలో ఎవరికి ఉన్నా.. హైడ్రా తన పని తాను చేస్తుందన్నారు.
ఇంతకి ఇది హైడ్రా నా హై డ్రామానా తెలియడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. అక్రమ నిర్మాణాలు జరుగుతుంటే ప్రభుత్వ యంత్రాంగం ఏమీ చేసిందని ప్రశ్నించారు. అప్పుడు అధికారులు అనుమతులు యే ప్రాతిపదికన ఇచ్చారని నిలదీశారు.