వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర అధికారుల బృందం పర్యటించింది. చోడవరంలో దెబ్బతిన్న బొప్పాయి, అరటి, కంద పంటలను కేంద్ర బృందం పరిశీలించింది. మద్దూరులో కేంద్ర బృందాన్ని కలిసి రైతులకు జరిగిన పంట నష్టాన్ని మాజీ మంత్రి వడ్డే శోభనదీశ్వరరావు వివరించారు. ఈ కార్యక్రమంలో పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్, జిల్లా కలెక్టర్ బాలాజీ, ఆర్డీవో రాజు పాల్గొన్నారు. బోడె ప్రసాద్ మాట్లాడుతూ.. వరద…
పార్టీ ఫిరాయింపులు, అనర్హత పిటిషన్ పై హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.. కోర్టు తీర్పుపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలు శునకానందాన్ని పొందుతున్నాయని ఆరోపించారు. బీఆర్ఎస్ వాళ్ళు చెప్పేది వాళ్ళు చేస్తే నీతి.. వేరే వాళ్ళు చేస్తే అవినీతి అన్నట్టు ఉందని విమర్శించారు. అనర్హత వేటు పడుతుంది.. ఉప ఎన్నికలు వస్తాయి.. ఇవ్వన్నీ మాట్లాడే అర్హత బీఆర్ఎస్ కి లేదని వ్యాఖ్యానించారు.
వచ్చే నాలుగు వారాల్లోగా ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపై చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్‌ను ఆదేశిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వాగతించారు. పార్టీ ఫిరాయింపులపై ద్వంద్వ ప్రమాణాలను అవలంబిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఈ తీర్పు ‘చెంపదెబ్బ’ అని ఆయన అభివర్ణించారు. కేటీఆర్ సోమవారం ఒక ప్రకటనలో, కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఫిరాయింపుల నిరోధక చట్టాలను కఠినంగా అమలు చేస్తామని హామీ ఇచ్చిందని, అయితే తెలంగాణలో ఫిరాయింపులను ప్రోత్సహించి, ప్రజాస్వామ్య…
Mahesh Kumar Goud: తొమ్మిది నెలల కాంగ్రెస్ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని టీపీసీసీ చీఫ్ బి.మహేష్ కుమార్ అన్నారు. కాంగ్రెస్ నేత మైనంపల్లి ఇంటికి మహేష్ కుమార్ వెళ్లారు.
బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్కున్న భక్తిప్రపత్తుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. సమకాలీన రాజకీయాల్లో యాగాలతో సెంటిమెంట్‌ను పండించే అతికొద్ది మంది నేతల్లో ఒకరు కేసీఆర్. గతంలో ఎర్రవల్లిలోని తన ఫామ్‌హౌస్‌లో చండీయాగం, రాజశ్యామల యాగంతోపాటు రకరకాల పూజలు నిర్వహించారాయన. అయితే ఈసారి గతానికి భిన్నంగా నవగ్రహ శాంతి యాగం నిర్వహించారట.
Jitta Balakrishna Reddy Dead:తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి (52) కన్నుమూశారు. గత కొంతకాలంగా బ్రెయిన్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న ఆయన సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. బాలకృష్ణారెడ్డి భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులు స్వస్థలం భువనగిరికి తరలించారు. సాయంత్రం 4 గంటలకు భువనగిరి శివారు మగ్గంపల్లిలోని ఫామ్‌హౌస్‌లో అంతక్రియలు జరగనున్నాయి. రాజకీయ నాయకులు జిట్టా మృతికి సంతాపం తెలుపుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో జిట్టా బాలకృష్ణారెడ్డి కీలక పాత్ర పోషించారు.…
Revanth Reddy Chitchat: ప్రజలందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గుండె కరిగిపోయే దృశ్యాలు… మనసు చెదిరిపోయే కష్టాలు…స్వయంగా చూశానని తెలిపారు.
కేసీఆర్ ట్రెండ్ మార్చబోతున్నారా? ఇక దూకుడు పెంచబోతున్నారా? అందుకోసం కీలక నిర్ణయం తీసుకున్నారా? దాని ప్రభావంతో కేడర్‌లో ఊపు వస్తుందా? ఎన్నికల ఫలితాలు, వలసలతో డీలాపడ్డ గులాబీ దళంలో ఉత్తేజం నింపడానికి కేసీఆర్ అందించబోతున్న ఆ చవన్ప్రాస్ ఏంటి? దాని ప్రభావం నిజంగానే ఆ రేంజ్లో ఉంటుందా? అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటోంది బీఆర్ఎస్. పార్లమెంట్ ఎన్నికల్లో కేవలం పదహారు శాతం ఓటు బ్యాంక్‌కు పరిమితం కావడం, పార్టీ చరిత్రలో తొలిసారి లోక్‌సభలో…
మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్‌రావు మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి చిట్ చాట్ లు కాదు.. చీట్ చాట్ లు అని, చిట్ చాట్ రికార్డ్ ఉండదు కాబట్టి, గ్లోబల్ ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రుణమాఫీ చేయని గజ దొంగ.. నన్ను దొంగ అంటున్నాడని, నేను ఇప్పటి కి రాజీనామా కి కట్టుబడి ఉన్నానని ఆయన తెలిపారు. ఆగస్టు 15 లోగా చాలా చోట్ల రుణమాఫీ జరగలేదని,…