తెలంగాణలో పెరుగుతున్న పోలీసుల ఉదాసీనతను విమర్శిస్తూ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఆందోళనకు దిగారు. చట్టాన్ని అమలు చేయకపోవడం, పెరుగుతున్న వేధింపులు మరియు రాజకీయ పూజలను సూచించే వివిధ సంఘటనలను ఆయన ఉదహరించారు. ట్విట్టర్ వేదికగా ఇటీవల నిజామాబాద్‌లో జరిగిన ఒక సంఘటనకు సంబంధించిన ఫోటోలను పంచుకున్నారు కేటీఆర్. అక్కడ ఒక స్వీట్ షాప్ యజమాని “పోలీసుల వేధింపుల కారణంగా దుకాణం మూసివేయబడింది” అని పేర్కొంటూ దాని ముందు భారీ బ్యానర్‌ను…
KTR: తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి కాంగ్రెస్ సర్కార్ రుణమాఫీ పేరుతో చేసిన మోసంపైన రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేకి భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ రాశారు.
Bandi Sanjay: త్వరలో కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ విలీనం కాబోతుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్, బీజేపీలో విలీనం అనే అంశంపై బండి సంజయ్ స్పందించారు.
దేవుడు మీద ఒట్టు పెట్టి చెప్తున్నా.. అర్హులకే రుణ మాఫీ చేస్తామని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి అన్నారు. రూ. రెండు లక్షల లోపు ఉన్న వారికే రుణాలు మాఫీ చేస్తామని స్పష్టం చేశారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. "ఎవరికైనా రుణ మాఫీ కాకుంటే ఆ ఫిర్యాదులు పరిష్కారం చేస్తాం.
సింగరేణి సంస్థ దేశ స్వాతంత్ర్యం కంటే ముందు నుంచి ఉన్న సంస్థ.. ఎంతో నిష్ణాతులైన, సమర్ధులైన సిబ్బంది ఉన్న సంస్థ.. బొగ్గు ఉత్పత్తిలో తిరుగులేని నైపుణ్యం ఉన్న సింగరేణి ఇతర మైనింగ్ రంగాల్లోకి విస్తరించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సూచించారు.
సిద్దిపేట ప్లెక్సీ వార్ ఘటనలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులపై సిద్దిపేట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని బీఆర్ఎస్ నాయకులపై కేసు నమోదు చేశారు. సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఫ్లెక్సీ చింపివేశారని బీఆర్ఎస్ నాయకుల ఫిర్యాదుతో కాంగ్రెస్ నాయకులపై కేసు నమోదైంది. సిద్దిపేట రూరల్, వన్ టౌన్, త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేశారు.. పోలీసులు. ఎమ్మెల్యే హరీష్ రావు హైదరాబాద్ నుంచి సిద్దిపేటకి కాన్వాయ్ తో బయలుదేరారు.…
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మహిళలపై చేసిన వ్యాఖ్యలను తెలంగాణ మహిళా కమిషన్ సుమోటోగా తీసుకున్న విషయం తెలిసిందే. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణాలపై మంత్రి సీతక్క.. 'బస్సుల్లో మహిళలు అల్లం వెల్లుల్లి, కూతలు అల్లికాలు చేసుకుంటే తప్పేంటీ' అని ప్రశ్నించారు.
హరీష్ రావు క్యాంపు కార్యాలయంపై దాడి హేయమైన చర్య అని ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డ మండిపడ్డారు. ఇటువంటి చిల్లర వేషాలకు తాము భయపడమని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీతో సహా కాంగ్రెస్ పార్టీ అంతా రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తాం అని మాటిచ్చారని గుర్తు చేశారు.
తెలంగాణ భవన్ లో కేటీఆర్, హరీష్ రావుల ఆధ్వర్యంలో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అందుబాటులో ఉన్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు చేపట్టిన రుణమాఫీపై ప్రధానంగా చర్చించారు.