క్రమశిక్షణ నేర్చుకోవాలని ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ శాసన సభ్యుడు కౌశిక్ రెడ్డికి సూచించారు. ఒక మిత్రుడిగా తనకు సలహా ఇస్తున్నానన్నారు. చీరల పట్ల గాజుల పట్ల చరిత్ర తల్లి దగ్గర కూర్చొని తెలుసుకోవాలన్నారు. తనకు కూడా ఆడ బిడ్డలు ఉన్నారన్న విషయాన్ని మర్చిపోవద్దన్నారు. కౌశిక్ మాటలకు తన మనసు బాధ పడే ఆవేశపూరితంగా మాట్లాడానని స్పష్టం చేశారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. “నాది అక్రమ సంపాదన అన్నావు.. వచ్చి నిరూపించు. నాకు ప్రజల శ్రేయస్సే ఎక్కువ.. నీ క్రమ శిక్షణ ఏంటో ప్రజలు చూశారు.. నా క్రమ శిక్షణ కేసీఆర్ చూసారు.. అన్ని పార్టీలు చూసాయి.. తప్పు చేసి క్షమాపణ చెప్పడం కాదు.. తప్పు చేయకుండా మాట్లాడాలి.. నాకు ఎప్పుడూ నీలాంటి వాళ్ళు ఎదురు కాలేదు.. నీ ఇంటి మీదికి వచ్చి జెండా ఎగురవేస్తా అంటే నువ్వేమైనా రౌడీవా.. మహిళల పట్ల గౌరవం లేని వాడివి.. గవర్నర్ ను కూడా దూషించన చరిత్ర నీది.. నీ లాంటి వాడితో జెండా ఎలా ఎగర వేయిస్తా..” అని గాంధీ వ్యాఖ్యానించారు.
READ MORE: YS Jagan: ఏలేరు వరదకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం..
అయినా సరే నా ఇంటికి వస్తా అంటే ఆహ్వానించానని ఎమ్మెల్యే గాంధీ అన్నారు. “వచ్చాక మీడియా ముఖంగా కూర్చోబెట్టి మాట్లాడే వాడిని.. నువ్వు అన్నట్లే నీవు చెప్పిన చోటుకు వచ్చే వాడిని.. కానీ నీ ప్రవర్తనే ఇక్కడికి తీసుకొచ్చింది.. సీనియర్లతో ప్రవర్తించే విధానం తెలుసుకో.. నీ మాయ మాటలకు పెద్దాయన మోసపోయి ఎమ్మెల్సీ చేశాడు.. మొదట కూడా అక్కడ ఎవరు లేక పార్టీ సీటు ఇచ్చారు..ఇలాంటి వాడి మాటలు విని ప్రభుత్వం పడగొట్టుకున్నారు. ప్రభుత్వాన్ని కులగొడతాం అని మాట్లాడుతున్నారు.. తప్పుడు మాటలు మాట్లాడే వారిని ప్రోత్సహిస్తే ఇప్పటికే అధికారం లేకుండా చేసింది.. ఇది ఇలాగే కొనసాగితే ప్రజలు మనల్ని కనుమరుగయ్యేలా చేస్తారు.. అధికారం లేక పోయినా ఓపికగా ఉండాలి.. చిన్న వాడినే అయినా నేనే చెబ్బుతున్నాను.. మద్రాసు విడి పోయినప్పుడు ప్రాంతీయ విబేధాలు రాలేదు.. రాష్ట్రం ఏర్పడ్డప్పుడు సోనియా గాంధీ అన్నతమ్ముల్లలా ఉండాలని చెప్పారు.. తప్పు నాదైతే నాకు చెప్పండి.. అతనిది తప్పుంటే అతనికి చెప్పండి.. పలు సార్లు నన్ను దూషిస్తేనే నేను మాట్లాడాను.. నిన్న కూడా ఒక ఐపీఎస్ అధికారిని నువ్వు దూషిస్తుంటే హరీష్ రావు నిన్ను వెనక్కు లాగాడు..
మమ్ములను కొట్టి మాపై కేసు పెట్టిన తీరు మీది.. సామరస్యంగా మాట్లాడే తత్వం నాది.. నిన్న పోలీస్ ఎస్కార్ట్ తో గాంధీ వెళ్ళాడని హరీష్ అన్నాడు.. అది నిజం కాదు.” అని ఎమ్మెల్యే అరికెపుడి మీడియా సమావేశంలో పేర్కొన్నారు.