Ponnam Prabhakar: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సెక్రటేరియట్ ఎదురుగా ఉన్న మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహం పనులను మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తెలంగాణ ప్రభుత్వ పక్షాన ఆవిష్కరిస్తామన్నారు. యువతకు రాజీవ్ గాంధీ విగ్రహం ఆదర్శం.. రాజీవ్ విగ్రహం ఏర్పాటు చేసుకోవడం అదృష్టం.. రాజీవ్ చిరస్మరణీయుడు అని ఆయన అన్నారు. విగ్రహంపై అనవసర రాజకీయాలు చేయొద్దు అని సూచించారు. రాజీవ్ పై మాట్లాడే వారికి ఆయనేంటో పుస్తకం పంపిస్తా.. రాజీవ్ విగ్రహం కూలగొడతం అంటే చూస్తూ ఊరుకోము.. ఒ్కసారి విగ్రహం టచ్ చేసి చూడండి అని హెచ్చరించారు. మరి సెక్రటేరియట్ కట్టెప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. మాకు ఎవరి పట్ల వివక్ష లేదు.. అమరవీరులకు, తెలంగాణ ఉద్యమకారులను అందరికి సముచిత గౌరవం ఇస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
ఇక, రేపు ఉదయం జరగబోయే నిమజ్జన కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది అని మంత్రి పొన్నం అన్నారు. హుస్సేన్ సాగర్ చుట్టూ 131 క్రేన్ లు ఏర్పాటు చేసాము.. GHMC పరిధిలో మరిన్ని క్రేన్ లు ఏర్పాటు చేసాం.. శివారు ప్రాంతాల్లో లేక్లు, మిని పాండ్స్ లో వినాయకుల నిమజ్జనం చేసుకునే అవకాశం ఉంది.. సాగర్ నిమజ్జనం చేసేందుకు వచ్చే ఉత్సవ కమిటీలకు విజ్ఞప్తి… త్వరగా నిమజ్జన కార్యక్రమం పూర్తీ చేయ్యాలని కోరారు. ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం ఉదయాన్నే ప్రారంభం అవుతుంది.. 70 ఏళ్ల అనుభవం ఉత్సవ కమిటీకి ఉంది.. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిమజ్జన శోభాయాత్ర కొనసాగుతుంది.. సాగర్ వైపు వచ్చే నిమజ్జన వాహనాలు జాగ్రత్తలు పాటించాలి.. ఎలాంటి ఇబ్బందులూ వచ్చినా కూడా వారికి సహాయం అందించేందుకు మా అలెర్ట్ టీం లు సిద్ధంగా ఉంటాయన్నారు. ప్రభుత్వం తరఫున నిరంతర పర్యవేక్షణ ఉంటుంది.. సాఫీగా నిమజ్జనం పూర్తి చేస్తామని మంత్రి ప్రభాకర్ చెప్పుకొచ్చారు.