ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభం సందర్భంగా పార్టీ శ్రేణులకు మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, అభివృద్ధి పథంలో నడిపిస్తున్న సీఎం కేసీఆర్.. దేశంలో గుణాత్మక మార్పు కోసం జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నారని తెలిపారు.
దేశ రాజకీయాల్లో అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైంది. దేశంలో గుణాత్మక మార్పు కోసం పాటుపడిన తెలంగాణ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇవాళ ఢిల్లీలో పార్టీ జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించారు.
ఢిల్లీలోని సర్దార్ పటేల్ మార్గ్‌లో బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభోత్సవం జరుగుతోంది. ముందుగా కార్యాలయ ఆవరణలో రాజశ్యామల యాగం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులకు వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌యాదవ్, కర్ణాటక మాజీ సీఎం కుమార స్వామి, తమిళనాడుకు చెందిన విడుతలై చిరుతైగల్ కచ్చి పార్టీ ఎంపీ చిదంబరం, పలు రాష్ట్రాల రైతు సంఘం నాయకులు, ఎమ్మెల్సీ కవితతో…
ఎమ్మెల్యే రేగా కాంతారావు.. మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు. ఇద్దరిదీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గమే అడ్డా. అధికారపార్టీలో ఇద్దరూ వలస నాయకులే. 2018 ఎన్నికల్లో పినపాకలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి తర్వాత కారు ఎక్కేశారు రేగా కాంతారావు. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు పాయం వెంకటేశ్వర్లు. అంతకుముందు జరిగిన 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచి గులాబీ కండువా కప్పుకొన్నారు పాయం. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరుడు.…
దేశవ్యాప్తంగా BRS కార్యకలాపాలు ప్రారంభించే దిశగా గులాబీ శిబిరంలో వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీలో పార్టీ కార్యాలయం సిద్ధమైంది. ఇక జరగాల్సిన మరో ముచ్చట.. పార్టీకి కొత్త కమిటీల ప్రకటన. ఆ పనిలోనే ఉన్నారు గులాబీ దళపతి. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలనే ఆలోచనలో ఉన్న సీఎం కేసీఆర్.. అందుకు తగ్గట్టుగానే పార్టీ కమిటీని వేసే పనిలో ఉన్నారు. ఆ ఫ్రేమ్‌లో పట్టేవారికే బీఆర్ఎస్ పదవులు కట్టబెడతారని సమాచారం. ఇతర రాష్ట్రాల్లో BRS విస్తరించేందుకు…
జాతీయ స్థాయిలో చక్రం తిప్పిందేకు టీఆర్ఎస్ పార్టీ పేరును కాస్తా బీఆర్ఎస్గా మార్చేశారు.. పొరుగు రాష్ట్రాల్లో పాగా వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.. మరో తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌పై కూడా బీఆర్ఎస్ నేతలు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది.. ఏపీలో ముఖ్య నేతలపై బీఆర్ఎస్ కన్నేసిందా..? అలాంటి వారిని గుర్తించి బీఆర్ఎస్లో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తోందా..? అంటే విశాఖలో జరిగిన ఓ పరిణామం ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది. సీబీఐ మాజీ అధికారి లక్ష్మీ నారాయణతో సమావేశం అవ్వడానికి తెలంగాణ…
CM KCR Delhi Tour : తెలంగాణ సీఎం కేసీఆర్ రేపు(సోమవారం) ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ నెల 14న బీఆర్ఎస్ ఆఫీసు ప్రారంభిస్తామని చెప్పిన నేపథ్యంలో ఆయన రేపు రాజధానికి పయనం కానున్నారు.