తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ (టీఆర్ఎస్) పేరును భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మార్చడం లాంఛనమే అంటున్నారు.. టీఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్ (భారత్ రాష్ట్ర సమితి)గా మారుస్తూ దసరా రోజు ఆ పార్టీ నేతలు తీర్మానం చేసిన విషయం తెలిసిందే కాగా.. ఆ తీర్మానం కాపీని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి అందజేశారు పార్టీ ప్రతినిధులు.. పార్టీ పేరు మార్పుపై అభ్యంతరాల స్వీకరణకు గడువు ఈ నెల 6వ తేదీతో ముగిసిపోయింది.. దీంతో ఏ క్షణంలోనైనా…
Kodali Nani: తెలంగాణ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీపై మాజీ మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో బీఆర్ఎస్ మనుగడకు కాలమే సమాధానం చెప్పాలని కొడాలి నాని అభిప్రాయపడ్డారు. అయితే రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనన్నారు. ఇప్పటికే రెండు సార్లు సీఎం అయిన కేసీఆర్ ప్రధాని కావాలని ఆరాటపడుతున్నారేమోనని కొడాలి నాని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఏపీ ప్రజలు కేసీఆర్ను వ్యతిరేకించారని.. అయితే ఆ తర్వాతి కాలంలో హైదరాబాద్లో సెటిలైన ఆంధ్రా వాళ్లు టీఆర్ఎస్…
రాహుల్ గాంధీ అతి ధైర్యం, పట్టుదలతో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 3500 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు. రెండుసార్లు ప్రధానిగా అవకాశం వచ్చినా ఆర్థికవేత్తకు అవకాశం ఇచ్చారని రాహుల్ను వీహెచ్ కొనియాడారు.
కాళేశ్వరం, మిషన్ భగీరథ, 24 గంటల కరెంట్ను ఉచితంగా ఇవ్వొచ్చని ఈ దేశంలో వ్యవసాయాన్ని లాభసాటిగా చేసి వ్యవసాయం దండగ కాదు పండుగ అని స్వల్ప సమయంలో నిరూపించిన వ్యక్తి కేసీఆర్ అంటూ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
బీఆర్ఎస్ జాతీయ పార్టీ ఏర్పాటు చేసిన సందర్భంగా గురువారం ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ను తమిళనాడు ఎంపీ, ప్రముఖ దళిత నేత, వీసీకే పార్టీ అధినేత తిరుమావళవన్తో వివిధ రాష్ట్రాల నాయకులు కలిశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన పార్టీ పేరును భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)గా మార్చడంతో పాటుగా జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. జాతీయ రాజకీయాల్లోకి ఎవరు వచ్చినా తాము స్వాగతిస్తామని ఆయన స్పష్టం చేశారు.
బీజేపీకి వ్యతిరేకంగా కమ్యూనిస్టుల తరువాత పోరాడే వ్యక్తి కేసీఆర్ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. అనేక అంశాలపై కేసీఆర్కు అవగాహన ఉందన్నారు.