Tammineni Veerabhadram: బీఆర్ఎస్తో పొత్తుల అంశం చర్చించలేదు.. అవన్నీ ఊహాగానాలే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tammineni Veerabhadram Gives Clarity on Alliance With BRS Party: బీఆర్ఎస్ పార్టీతో పొత్తుల అంశం ఇంకా చర్చించలేదని, సీట్ల విషయంలో జరుగుతున్న ప్రచారాలన్నీ ఊహాగానాలేనని సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. మీడియాతో మాట్లాడిన ఆయన.. తనకు పాలేరు నుంచి పోటీ చేయాలని ఉద్దేశం ఏమాత్రం లేదని తేల్చి చెప్పారు. ఎన్నికల సమయానికి తాము పొత్తుల విషయాన్ని ప్రకటిస్తామన్నారు. ప్రస్తుతం ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగుతోందన్నారు. రాష్ట్రంలో రోజురోజుకి బీజేపీ పార్టీ బలపడుతున్న మాట వాస్తవమేనన్న ఆయన.. కాంగ్రెస్ పార్టీ మాత్రం బలహీనపడుతోందన్నారు. కాంగ్రెస్‌లో ఉన్న కీలక నేతలు బీజేపీలోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఒక్క తెలంగాణలోనే కాదు, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బలహీన పడుతోందని చెప్పారు. జాతీయ స్థాయిలో బీజేపీని ఎదుర్కొనే సరైన ఆయుధం కాంగ్రెస్‌కు లేదన్నారు. బీజేపీ హిందుత్వ ఎజెండాతో బలంగా ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తోందన్నారు. బీజేపీని తెలంగాణలో ఎంట్రీ ఇవ్వకుండా చేయాల్సిన ప్రయత్నాలన్నీ తాము చేస్తామన్నారు.
అంతకుముందు.. మతోన్మాద బీజేపీకి వ్యతిరేకంగా తాము బీఆర్ఎస్‌తో కలిసి పోరాడుతామని తమ్మినేని వీరభద్రం ప్రకటించారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తూ, ప్రలోభాలకు గురిచేస్తూ, ఇతర పార్టీలను తమ పార్టీలో కలుపుకుంటోందని దుయ్యబట్టారు. బీజేపీ విధానాలను ఎండగట్టిన ఆయా రాష్ట్ర ప్రభుత్వాలపై ఉసిగొల్పుతోందని.. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలపై సీఎం కేసీఆర్ ధీటుగా పోరాటాలు చేస్తున్నందుకే ఆయనతో కలిసి మునుగోడు ఉప ఎన్నికల్లో పని చేశామని తెలిపారు. భవిష్యత్‌లోనూ బీఆర్‌ఎస్‌తో కలిసి పని చేస్తామన్నారు. తొలుత కేసీఆర్ ఏడేళ్లపాటు బీజేపీతో సఖ్యతతో ఉన్నారని.. కానీ ఆ పార్టీ ఇప్పుడు తెలంగాణలో అధికారం కోసం ప్రయత్నాలు చేస్తుండటంతో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నారన్నారు. ప్రధాని మోడీకి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు భయపడుతున్నారని.. ఏపీ సీఎం జగన్‌పై కేసులు ఉండటంతో ఆయన మరీ భయపడుతున్నారని వ్యాఖ్యానించారు.
Also Read
- Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
- Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
- RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
- Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు