Malla Reddy: ఏపీలోని 175 స్థానాల్లో బీఆర్ఎస్ పోటీ.. కాళేశ్వరం తరహాలో పోలవరం పూర్తి చేస్తాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Malla Reddy: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశం ఎప్పటికీ రాజకీయ పార్టీలకు అస్త్రంగానే ఉంది.. అయితే, ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదు అంటూ పలు సందర్భాల్లో పార్లమెంట్ వేదికగా కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ స్పష్టం చేసింది.. అయితే, తాము అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెబుతూ వస్తోంది కాంగ్రెస్ పార్టీ.. ఈ తరుణంలో పోలవరం ప్రాజెక్టు, ప్రత్యేక హోదాపై సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ మంత్రి మల్లారెడ్డి.. తిరుమలలో ఇవాళ శ్రీవారిని దర్శించుకున్న ఆయన.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో పోలవరం పూర్తి కాలేదు.. ప్రత్యేక హోదా సాధించలేదన్నారు.. అయితే, రాష్ట్రంలో బీఆర్ఎస్‌ని గెలిపిస్తే కాళేశ్వరం తరహాలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని ప్రకటించారు మల్లారెడ్డి.
Read Also: Vaikunta Ekadasi 2023: వైకుంఠ ఏకాదశి.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు
Also Read
మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి దేశవ్యాప్తంగా మంచి స్పందన లభిస్తోందని తెలిపారు మంత్రి మల్లారెడ్డి.. 8 సంవత్సరాల కాలంలో తెలంగాణలో చేసిన అభివృద్దిని చూసి ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఆదరిస్తున్నారన్న ఆయన.. 2024లో ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్ఎస్ నుంచి 175 నియోజకవర్గాలలో పోటీ చేయడం ఖాయం.. అంతేకాదు విజయం సాధించడం కూడా ఖాయమనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు మంత్రి మల్లారెడ్డి. కాగా, ఆంధ్రప్రదేశ్‌లోని బీఆర్ఎస్ విస్తరణపై గురి పెట్టారు తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్ రావు.. ఇవాళ ఏపీకి చెందిన పలువురు నేతలు.. మాజీమంత్రి రావెల కిషోర్ బాబుతో పాటు రిటైర్డ్ ఐఏఎస్ తోట చంద్రశేఖర్ ఈ రోజు తెలంగాణ భవన్ లో కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరనున్నారు. మరికొందరు ఏపీ నేతలు కూడా గులాబీ కండువా కప్పుకోబోతున్నారు.
తాజావార్తలు
-
Sobhita Dhulipala: ఒక హీరోతో ఇలా పెళ్లి జరుగుతుందని ఎప్పుడూ అనుకోలేదు: శోభితా ధూళిపాళ్ల
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని శుభాలే, స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు!
-
Boltt Ace 5G, Evo: బోల్ట్ ఏస్ 5G, ఇవో రిలీజ్.. 6000mAh బ్యాటరీ, 64MP AI కెమెరా, 8GB ర్యామ్.. ధర, ఫీచర్లు ఇవే
-
US Iran Sanctions: ఇరాన్‌తో ఆయిల్ డీల్స్.. 4 భారతీయ కంపెనీలపై ట్రంప్ ఆంక్షలు! అసలు కారణం ఇదే
-
Sugar Prices Fall: సామాన్యులకు తీపి కబురు.. భారీగా తగ్గిన చక్కెర ధరలు
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!