కర్నూలు జిల్లా పత్తికొండలో అన్ని ఏర్పాట్లు చేశారు.. సగం కార్యక్రమాలు పూర్తి చేశారు.. కానీ, పెళ్లి సమయానికి పెళ్లి కూతురు వెళ్లిపోవడంతో.. ఆ మ్యారేజ్ పీఠలపైనే నిలిచిపోయినట్టు అయ్యింది..
కొందరు 35 ఏళ్లు దాటి.. 40 ఏళ్లు వచ్చిన పెళ్లి కాకపోవడంతో.. ఏదో ఒక పిల్ల అయితే చాలని వెంటనే కమిట్ అవుతున్నారు.. 40 ఏళ్లకు పెళ్లి కుదరడంతో.. ఎగిరి గంతేసి.. వెనకాముందు చూడకుండా.. పెళ్లి చేసుకొని.. వారం రోజుల తర్వాత అసలు విషయం బయటపడడంతో.. ఓ నవ వరుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
Viral Video: సోషల్ మీడియాలో అప్పుడప్పుడు పెళ్లికి సంబంధించిన వీడియోలు వైరల్ గా మారడం మనం చూస్తూనే ఉంటాము. పెళ్ళిలో జరిగే వింత సంఘటనలు సంబంధించి అనేక వీడియోలు ఇప్పటికీ మనం చాలానే చూశాను. ఇదే కోవకు చెందిన మరో వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఓ కొత్త జంట వారి వివాహ వేడుకలో ఎంతో సంతోషంగా గడుపుతున్న సమయంలో జరిగిన సంఘటన ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతుంది.…
పసుపు పారాణి ఆరకముందే.. ఓ నవ వధువు దారుణ హత్యకు గురైనట్టు కటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.. పెళ్లి చేసుకుని నెల రోజులు కూడా నిండక ముందే.. భర్త తన భార్యను అత్యంత దారుణంగా చంపేశాడు. నవ వధువు గొంతు నులిమి, చెవిపై బలంగా కొట్టడంతోనే రక్తం కారి చనిపోయిందని మృతురాలి బంధువులు చెబుతున్నారు.. హైదరాబాద్ జరిగిన ఈ ఘటనపై అమలాపురంలోని భర్త ఇంటి ముందు మృతదేహంతో బంధువులు ఆందోళనకు దిగారు. భర్త, అతని కుటుంబ సభ్యులపై చర్యలు…
నిజామాబాద్ జిల్లాలో మటన్ ముక్కలు పంచాయితీ పెట్టాయి.. పెళ్లి విందులో రసాభాసకు కారణంగా మారాయి.. పెళ్లి భోజనంలో మాంసాహారం కోసం వరుడు, వధువు తరపు బంధువులు పరస్పరం దాడులు చేసుకున్నారు.. అంతేకాదు.. 19 మందిపై కేసులు కూడా నమోదు అయ్యాయి..
Pre First Night Shoot Video Viral: ఈ మధ్య ప్రజలు కొత్త పుంతలు తొక్కడంలో బాగా ఆరితేరుతున్నారు. ప్రజల్లో పిచ్చి పరాకాష్టకు చేరుతుందన్నడానికి కొన్ని తాజా సంఘటనలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. విదేశీయులు భారతీయ సంస్కృతిని మెచ్చి ఇటువైపు అడుగులు వేస్తుంటే.. భారతీయులు మాత్రమే., అందుకు విరుద్ధంగా పాశ్యాత్య సంస్కృతి వైపు అలవాటు పడుతున్నారు. గతకొన్ని సంవత్సరాలుగా నూతన వధూవరులు పెళ్లి చేసుకునే ముందు ఫ్రీ వెడ్డింగ్ షూట్ అనే పేరుతో పొలాల్లో, వాగులు, వంకలు, నదులు,…
వధువు విషయంలో కేరళలోని ఒక జిల్లా వినియోగదారుల కోర్టు మ్యాట్రిమోనీకి షాకిచ్చింది. ఒక వ్యక్తికి వధువును కనుగొనడంలో విఫలమైనందుకు మ్యాట్రిమోనీ సైట్‌ను బాధ్యులను చేయడమే కాకుండా దానికి రూ. 25,000 జరిమానా కూడా విధించింది. అంతే కాకుండా బాధితుడి ఖర్చు మొత్తాన్ని వడ్డీతో సహా తిరిగి ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.
యూపీలోని ఝాన్సీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఝాన్సీ-కాన్పూర్ హైవేపై డీసీఎం, కారు ఢీకొన్నాయి. కొద్దిసేపటికే రెండు వాహనాల్లో మంటలు చెలరేగడంతో కారులోని వరుడితో సహా నలుగురు సజీవదహనమయ్యారు.
పెళ్లంటే ఎంతో హడవిడి ఉంటుంది. అనుకున్న సమయానికి పెళ్లి జరగాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. అందుకోసం పెళ్లి ఏర్పాట్లు చకాచకా కానిస్తారు. కానీ.. ఇక్కడ ఓ వింత ఘటన జరిగింది. వరుడు మద్యం తాగి ఆలస్యంగా వచ్చాడని వధువు వివాహాన్ని రద్దు చేసింది. ఈ ఘటన బీహార్లోని కటిహార్లో జరిగింది. అంతేకాకుండా.. పెళ్లి ఏర్పాట్ల కోసం ఖర్చైన రూ. 4 లక్షలు ఇవ్వాలని వరుడు తల్లిదండ్రులను డిమాండ్ చేసింది.
భారతీయులకు ఓటు హక్కు చాలా విలువైనది.. గన్ కన్నా గొప్పది పెన్ను.. అలాగే దేశ అభివృద్ధి కోసం ఓటు అంత గొప్పది.. మనకు నచ్చిన నాయకుడిని ఓటు హక్కుతో ఎంపిక చేసుకోవచ్చు.. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి.. దేశం నలుమూలలోని ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.. తాజాగా ఓ పెళ్లి కూతురు ఓటు వేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. దేశవ్యాప్తంగా రెండో దఫా పోలింగ్ మొదలైంది.…