Haryana: పెళ్లి జరిగిన మరుసటి రోజే వధువు పరారీ.. భర్తకు, అత్తకి టీలో మత్తు ఇచ్చి..
- హర్యానాలోని సోనిపట్‌లోని ఖర్‌ఖోడాలో ఆశ్చర్యకరమైన కేసు
- పెళ్లి జరిగిన మరుసటి రోజే వధువు పరారీ
- భర్తకు, అత్తకి టీలో మత్తు ఇచ్చిన నవ వధువు
- బంగారు నగలు, రూ.2 లక్షల నగదు ఎత్తుకెళ్లినట్లు ఆరోపణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హర్యానాలోని సోనిపట్‌లోని ఖర్‌ఖోడాలో ఆశ్చర్యకరమైన కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ పెళ్లి జరిగిన మరుసటి రోజే నవ వధువు పారిపోయింది. పెళ్లికూతురు అర్ధరాత్రి టీలో మత్తు మందు కలిపి అత్త, భర్తలకు తాగించింది. ఆ తర్వాత ఇద్దరు అపస్మారక స్థితిలోకి చేరగానే వధువు ఇంట్లోని బంగారు నగలు, రూ.2 లక్షల నగదు ఎత్తుకెళ్లినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇంట్లో సామాన్లన్నీ చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఈ ఘటనపై ఖార్‌ఖోడా పోలీసులు కేసు నమోదు చేశారు.
READ MORE: Donald Trump: డొనాల్డ్ ట్రంప్ గెలిచిన తర్వాత హెచ్1బీ వీసా గురించి భారతీయుల సెర్చ్..!
Also Read
- Team India: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. 4 ఏళ్ల తర్వాత జట్టులోకి స్టార్ ప్లేయర్..
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
- WI Vs Ind: ముగిసిన వెస్టిండీస్ బ్యాటింగ్.. భారత్ టార్గెట్ 172 పరుగులు..
పోలీసుల సమాచారం ప్రకారం… సోనిపట్‌లోని ఖర్ఖోడా గురుకుల వీధికి చెందిన ఓ యువకుడు హరిద్వార్‌కు చెందిన పల్లవిని నవంబర్ 13న వివాహం చేసుకున్నాడు. అదే సమయంలో దాదాపు 1.25 లక్షల రూపాయలను కూడా వధువు తరఫు వారికి అందించారు. వివాహం తర్వాత, యువకుడు నవంబర్ 14న ఖర్ఖోడా చేరుకున్నాడు. నవంబర్ 24న ఇక్కడ వివాహ రిసెప్షన్ నిర్వహించగా, నవంబర్ 15వ తేదీ రాత్రి నవ వధువు టీలో మత్తు మందు కలిపి భర్తకు, అత్తకి ఇచ్చింది. టీ తాగి వధువు భర్త, అత్త స్పృహతప్పి పడిపోయారు. ఇంతలో బంగారు నగలు, రూ.2 లక్షల నగదుతో వధువు పరారైంది. దీని తర్వాత, యువకుడు, అతని తల్లి ఖర్ఖోడా ఆసుపత్రిలో చేరారు. ఇంటికి చేరుకునే సరికి పరిస్థితి సద్దుమణిగేసరికి ఇంట్లోని వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఇంట్లో చాలా వస్తువులు కూడా పోయాయి. నవ వధువు తండ్రికి ఫోన్ చేయగా, వారి ఫోన్లు స్విచ్ఛాఫ్ అయ్యాయి. ఈ విషయంపై బాధిత యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేసి విచారణ జరిపించాలని కోరాడు.
తాజావార్తలు
-
Team India: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. 4 ఏళ్ల తర్వాత జట్టులోకి స్టార్ ప్లేయర్..
-
Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
-
Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
-
WI Vs Ind: ముగిసిన వెస్టిండీస్ బ్యాటింగ్.. భారత్ టార్గెట్ 172 పరుగులు..
-
Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!