ఎన్ని చేసినా ‘కుక్కతోక వంకరే’ అనే సామెతకు తగ్గట్టుగా ఉంది గజ్వేల్‌లో మున్సిపల్ కార్యాలయంలోని ఓ అధికారి తీరు. రోజూ అవినీతి చేస్తూ పట్టుబడుతున్నవారిని గురించి వింటూనే ఉన్నాడు.. కానీ.. తాను మాత్రం బుద్ధి మార్చుకోలేకపోయాడు.. గజ్వేల్ మున్సిపల్ కార్యాలయ అధికారి అవినీతి బాగోతం బయటపడింది. మార్వాడీలకు ట్రేడ్ లైసెన్స్ ల జారీ విషయంలో అదనంగా డబ్బులు వసూలు చేశాడు గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కార్యాలయ అధికారి. తమ షాపుల లైసెన్స్ రెన్యూవల్ కోసం సంబంధిత అధికారిని ఆశ్రయించారు బాధితులు. అయితే.. నిబంధనల ప్రకారం రూ.46వేల ఫీజు చెల్లించాల్సి ఉండగా ఎక్కువ డబ్బులు డిమాండ్ చేశాడు సదరు అధికారి. లేదంటే లైసెన్స్‌లు పెండింగ్ లో పెడతానని బెదిరింపులు దిగాడు.
అయితే… అంత డబ్బు తాము చెల్లించలేమని మార్వాడీ వ్యాపారులు ఎంత విన్నవించుకున్నా మున్సిపల్ అధికారి వినలేదు.. చివరకు రూ.46వేల ఫీజుతో పాటు అదనంగా మరో రూ.10,720 ముట్టజెప్పారు బాధితులు. అయితే.. అడిగినంత డబ్బులు ఇవ్వలేదని.. లైసెన్స్ లు ఇవ్వకుండా పెండింగ్ పెట్టడంతో బాధితులు మున్సిపల్ చైర్మన్, కమిషనర్ కి ఫిర్యాదు చేశారు. దీంతో.. విచారణ చేపట్టిన అధికారులు అదనంగా వసూలు చేసింది నిజమేనని నిర్ధారణకు వచ్చి.. అధికారికి షోకాజు నోటీసు జారీ చేశారు. మూడు రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశాలు ఆదేశాలు ఇచ్చారు.