గత రెండు సంవత్సరాలు భారత్‌తో పాటు ప్రపంచ దేశాలను సైతం పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. గత నెల దక్షిణాఫ్రికాలో బయటపడ్డ ఒమిక్రాన్ వేరియంట్‌తో ప్రజలు మరింత భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఒమిక్రాన్ వేరియంట్ పలు దేశాలకు వ్యాప్తి చెందడంతో విమాన ప్రయాణాలపై ఆంక్షాలు విధించారు. అంతేకాకుండా విదేశాల నుంచి భారత్‌కు వచ్చిన వారికి కరోనా పరీక్షలు మరింత ముమ్మరంగా వైద్యులు చేస్తున్నారు. అయితే తాజాగా నెల్లూరు జిల్లాలోని కావలిలో కరోనా కలకలం సృష్టిస్తోంది. కావలికి చెందిన ఇద్దరు వైద్యులు ఇటీవల అమెరికా నుంచి భారత్‌కు వచ్చారు.
ఈ నేపథ్యంలో వారికి కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా నిర్థారణైంది. అంతేకాకుండా వారి నుంచి మరో ఇద్దరికి కూడా ఈ కరోనా సోకడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం ఆ ఇద్దరు వైద్యులు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుప్రతిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. అయితే వారికి ఒమిక్రాన్ వైరస్ సోకి ఉండవచ్చని జిల్లా వాసులు కలవరడపడుతున్నారు. దీంతో కలెక్టర్ ఆదేశాలతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.