దేశంలో 35కు చేరిన ఒమిక్రాన్ కేసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత నెల దక్షిణాఫ్రికాలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ వేరియంట్ డెల్టా వేరియంట్ కంటే 6 రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు ప్రపంప ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అంతేకాకుండా ఈ వేరియంట్ బయటపడ్డ 15 రోజుల్లోనే 66 దేశాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. అయితే ఇటీవలే ఈ ఒమిక్రాన్ వేరియంట్ భారత్‌లోకి కూడా ప్రవేశించింది. రోజురోజుకు చాపకింద నీరులా ఒక్కొక్క రాష్ట్రంపై ఈ ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం చూపుతోంది.
అయితే తాజాగా ఏపీలో కూడా 2 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీ వైద్యారోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలకు తగు సూచనలు కూడా చేశారు. ఏపీలో కొత్తగా నమోదైన కేసులతో మొత్తం దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య 35కు చేరింది. ఇప్పటికే మహారాష్ట్రలో ఒమిక్రాన్ వ్యాప్తి వేగంగా ఉండటంతో ఆ రాష్ట్రంలో నిన్న, నేడు 144 సెక్షన్‌లు అమలు చేశారు. ఇదిలా ఉంటే ఒమిక్రాన్ వెలుగులోకి వచ్చిన తరువాత కరోనా కేసుల సంఖ్య కూడా పెరగడం మొదలైంది. విదేశాల నుంచి వచ్చిన వారికి ఒమిక్రాన్ నిర్థారణవడంతో వారి కాంటాక్టులకు కరోనా పరీక్షలు నిర్వహించడం అధికారులకు సవాల్‌గా మారింది.
Also Read
తాజావార్తలు
-
Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును మడతపెట్టేసిన అభిషేక్ శర్మ.. వరల్డ్ రికార్డు..
-
El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
-
Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకుకి పూనకాలు.. రికార్డుల మీద రికార్డులు..
-
AP Govt: ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న పేదలకు శుభవార్త.. శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!