ప్రపంచ దేశాలను భయాందోళనకు గురిచేస్తోన్న కరోనా మహమ్మారి రూపాంతరాలు చెంది మరోసారి ప్రజలను భయపెడుతోంది. ఇప్పడిప్పుడే కరోనా డెల్టా వేరియంట్ నుంచి బయటపడుతున్న వేళ దక్షిణాఫ్రికాలో వెలుగులోకి వచ్చిన కరోనా కొత్త వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికీ ఈ వేరియంట్ పలు దేశాల్లో వ్యాప్తి చెందుతుండగా ఇటీవల భారత్‌లోకి కూడా ఈ వేరియంట్ ప్రవేశించి చాపకింద నీరులా వ్యాప్తి చెందుతోంది.
ఈ రోజు కొత్తగా ఏపీలో 2 ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా.. తాజాగా ఛండీగడ్‌లో కూడా తొలి ఒమిక్రాన్ కేసు నమోదైనట్లు వైద్యారోగ్య అధికారులు వెల్లడించారు. ఇటీవల ఇటలీ నుంచి నవంబర్ 22న వచ్చిన 20 ఏళ్ల యువకుడిలో ఈ ఒమిక్రాన్ వేరియంట్‌ను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు.