టీనేజ్ లోనే యాంకరింగ్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది రెజీనా కసండ్ర. ఆ తర్వాత షార్ట్ ఫిల్మ్స్ మీదుగా వెండితెరపైకి వచ్చింది. హీరోగా సుధీర్ బాబు, హీరోయిన్ గా రెజీనా ఇద్దరూ 2012లో ‘ఎస్.ఎం.ఎస్.’ మూవీతోనే తెలుగువారి ముందుకొచ్చారు. ఫస్ట్ మూవీతోనే నటిగా గుర్తింపు పొందిన రెజీనాకు ఇక వెనుదిరిగి చూసుకోవాల్సిన పని పడలేదు. ‘రొటీన్ లవ్ స్టోరీ, కొత్తజంట, రా.. రా…. కృష్ణయ్య, పవర్, పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సౌఖ్యం, శౌర్య, ఎవరు, జ్యో అచ్యుతానంద, శంకర, నక్షత్రం, బాలకృష్ణుడు’ వంటి చిత్రాలలో నాయికగా నటించింది. వాటిలో ‘కొత్తజంట, ఎవరు, జ్యో అచ్యుతానంద, అ!’ చిత్రాలు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఈ మధ్య కాలంలో కెరీర్ పరంగా కాస్తంత వెనకబడిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఒక్కసారిగా వేగం పెంచింది.
Read also : ఇప్పుడు దీపికా వంతు… డార్లింగ్ అదిరిపోయే ఆంధ్రా విందు
ఈ యేడాది ఇప్పటికే విశాల్ మూవీ ‘చక్ర’తో జనం ముందుకు వచ్చిన రెజీనా, ఏకంగా ఐదారు ప్రాజెక్ట్స్ ను లైన్ లో పెట్టింది. అందులో తెలుగు, తమిళ బైలింగ్వల్ మూవీస్ సైతం ఉన్నాయి. విశేషం ఏమంటే… కథ రీత్యా ఇవన్నీ కూడా డిఫరెంట్ జోనర్ కు చెందిన చిత్రాలే. అయితే అందులో కొన్ని థ్రిల్లర్, మర్డర్ మిస్టరీ, హారర్ మూవీస్ ఉన్నాయి! ప్రస్తుతం రెజీనా ‘నేనే… నా’, ‘శాకిని డాకిని’, ‘ఫ్లాష్ బ్యాక్’, ‘బ్రేకింగ్ న్యూస్’ వంటి తెలుగు సినిమాలలో నటిస్తోంది. అలానే ‘బోర్డర్, పార్టీ’ వంటి తమిళ చిత్రాలలో నాయిక చేస్తోంది. ఇదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘ఆచార్య’లో రెజీనా ఐటమ్ సాంగ్ చేస్తుండటం విశేషం. దీనితో పాటు ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ కోసం రెజీనా ‘అన్యాస్ ట్యుటోరియల్’ అనే వెబ్ సీరిస్ చేస్తోంది. డిసెంబర్ 13వ తేదీ 32వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న రెజీనా, వివాహం గురించి మాత్రం పెదవి విప్పడంలేదు. అయితే గతంలో మెగా ఫ్యామిలీ యంగ్ హీరో ఒకరితో రెజీనా సన్నిహితంగా ఉండేదంటూ రూమర్స్ బాగానే వచ్చాయి.