సీఎం కేసీఆర్ నిన్న కేంద్రంపై చేసిన వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కౌంటర్ ఇచ్చారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అవినీతి సామ్రాట్ నీవు కేసీఆర్.. ప్రధానమంత్రి పై మాట్లాడే స్థాయి నీకు లేదని ఆమె అన్నారు. 12 వందల పిల్లల ప్రాణాలు తీసుకుని ఆ సీట్లో కూర్చున్నావ్.. కొంచం అన్నా సిగ్గు శరం లేదు అంటూ తీవ్రంగా ధ్వజమెత్తారు. తెలంగాణ కోసం ఏం పీకినవో చెప్పు అంతో ఆమె వ్యాఖ్యానించారు. నీ ఆలోచనే…
ప్రభుత్వానికి మాట తప్పే జబ్బు.. మనస్సు మార్చుకునే జబ్బు వచ్చిందని పీఆర్సీ సాధన సమితి ప్రతినిధి బండి శ్రీనివాసరావు అన్నారు. ఈ కరోనా జబ్బు మమ్మల్నేం చేయలేదని, ప్రభుత్వానికి వచ్చిన జబ్బు కంటే కరోనా ఏం పెద్ద జబ్బు కాదని ఆయన వ్యాఖ్యానించారు. హడావుడిగా జీతాలు వేసేశారని, చనిపోయిన వారికీ జీతాలు వేసేశారని ఆయన అన్నారు. సీఎఫ్ఎంఎస్ తీసేయాలన్న మంత్రి బుగ్గన ఇప్పుడు అదే వ్యవస్థ ద్వారా మాకు జీతాలు వేస్తున్నారని, ఈ ప్రభుత్వానిదంతా రివర్సేనని ఆయన…
కేంద్ర బడ్జెట్ లో ఉత్తరాంధ్రకు అన్యాయం జరిగిందంటూ సీపీఐ ఆందోళన చేపట్టింది. బడ్జెట్లో దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రస్తావన లేకపోవడంపై సీపీఐ నేతలు ఆగ్రహం వ్యక్తం చేసారు. సీపీఐ కార్యాలయం నుంచి రైల్వే స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం రైల్వే స్టేషన్ వద్ద సీపీఐ నాయకులు, కార్యకర్తలు ధర్నా చేపట్టారు. ఈ సందర్బంగా సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ.. ఈ బడ్జెట్ లో ఆంధ్ర రాష్ట్రానికి మొండిచేయి చూపించారన్నారు. విశాఖ…
నదుల అనుసంధానం చేస్తామని బడ్జెట్ లో నిర్మల సీతారామన్ చెప్పారని, రాష్ట్రాల తో సంబంధం లేకుండా ఆమె ప్రకటించారని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ అన్నారు. తెలంగాణలో ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వడం లేదు కానీ ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలకు నిధులు జారీ చేస్తుందని ఆయన అన్నారు.వాజపేయి ప్రధాని గా ఉండగా రాజ్యాంగం పై సమీక్ష కు 11 మందితో కమిటీ వేసింది. వెంకటచలయ్యా కమిషన్ వేసింది.. గోదావరి నది జలాలను కావేరి లోకి…
ఏపీలో సంచలనం సృష్టించిన సినిమా టికెట్ల ధరలపై ఇంకా ఎలాంటి స్పష్టత నెలకొనలేదు. అయితే ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ ధరలపై జీవో 35ను ప్రవేశపెట్టింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో పై హై కోర్టును పలువురు నిర్మాతలు, ఎగ్జిబ్యూటర్ ఆశ్రయించారు. దీంతో విచారణ చేపట్టిన హై కోర్ట్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన జీవో ను రద్దు చేసింది. దీంతో హై కోర్ట్ తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సింగిల్ డివిజన్ బెంచ్ లో అప్పీల్ చేసింది.…
గత రెండు సంవత్సరాలుగా యావత్తు ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారి తగ్గడం లేదు. కరోనా కట్టడికి అగ్ర దేశమైన అమెరికా సైతం కోవిడ్ టీకాలపైనే ఆధారపడింది. అయితే ఇప్పటికే కరోనా టీకాలు ఆయా దేశాలు విస్తృతంగా చేపట్టాయి. అయితే ఫ్రాన్స్ వంటి దేశాల్లో 75శాతం కరోనా టీకాలు పంపిణీ జరిగినా కరోనా కేసులు మాత్రం తగ్గడం లేదు. అయితే భారత్ లో కరోనా సెకండ్ వేవ్ తరువాత కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. కానీ.. దక్షిణాఫ్రికా…
తెలంగాణ సర్కార్ నాటు సారాను అదుపుచేసేందుకు ప్రయత్నించినా అధికారుల కళ్ళు గప్పి దుండగులు గ్రామాల్లో నాటు సారాను తయారు చేస్తున్నారు. జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలో విచ్చల విడిగా గుడుంబా తయారీ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో గ్రామాల్లో గుడుంబా గుప్పు మంటోంది. అయితే మామూళ్ల కోసం తప్ప ఆబ్కారీ శాఖ కన్నెత్తి చూడడం లేదని పలువురు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామాల్లో వి.డి.సి కమిటీ ఆధ్వర్యంలో టెండర్ల ద్వారా అమ్మకాలు జరుగుతున్నాయని, గ్రామానికి కూతవేటు…
గుంటూరులో డెవలప్మెంట్ ఆఫ్ అర్బన్ ఫారెస్ట్ లో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏపీ హోంమంత్రి సుచరిత ప్రారంభించారు. బ్రాడిపేట లోని క్యాంప్ కార్యక్రమం నుండి వర్చువల్ విధానంలో హోంమంత్రి సుచరిత పాల్గొన్నారు. మియావాకి పద్దతిలో రాష్ట్రంలోని ఎనిమిది బెటాలియన్ లలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని సుచరిత ప్రారంభించారు. మంగళగిరి 6వ బెటాలియన్ లో డీజీపీ గౌతం సవాంగ్, ఇతర పోలీసు ఉన్నతాధికారులు మొక్కలు నాటారు. అన్ని బెటాలియన్ లలోని దాదాపు 15.35 ఎకరాల్లో 19,774 మొక్కలను…
నకిలీ ఇన్వాయిస్లు, నకిలీ స్టేట్మెంట్లతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కు భారీ మొత్తంలో కుచ్చుటోపీ పెట్టారు. నందిని ఇండ్రస్టీస్ ఇండియా లిమిటెడ్ పేరుతో సెక్యూరిటీగా రూ.77 కోట్ల విలువైన ఆస్తులు పెట్టి రూ. 303 కోట్లు రుణం తీసుకున్నారు. అయితే రుణానికి సంబంధించిన డబ్బులు తిరిగి చెల్లించకుండా కంపెనీ చేతులెత్తేసింది. దీంతో బ్యాంకు అధికారులు సీబీఐ ను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు నందిని ఇండస్ట్రీస్ పై సీబీఐ కేసు నమోదు. అంతేకాకుండా…
డ్రగ్ పెడ్లర్ టోనీ ఐదు రోజుల కస్టడీ నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో నేడు పోలీసు అధికారులు విచారణ చేయనున్నారు. ఐదవ రోజు విచారణలో భాగంగా వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్ & నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధ కిషన్, సీఐ నాగేశ్వర రావు లు రంగంలోకి దిగనున్నారు. టోనీ వాట్స్ అప్ లో ఆరుగురు హైదరాబాద్ కు చెందిన వ్యాపారులు, పది మంది ముంబాయి,పూణే వారీ వివరాలపై అరా తీయనున్నారు. ఇప్పటికే…