గత రెండు సంవత్సరాలుగా యావత్తు ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారి తగ్గడం లేదు. కరోనా కట్టడికి అగ్ర దేశమైన అమెరికా సైతం కోవిడ్ టీకాలపైనే ఆధారపడింది. అయితే ఇప్పటికే కరోనా టీకాలు ఆయా దేశాలు విస్తృతంగా చేపట్టాయి. అయితే ఫ్రాన్స్ వంటి దేశాల్లో 75శాతం కరోనా టీకాలు పంపిణీ జరిగినా కరోనా కేసులు మాత్రం తగ్గడం లేదు. అయితే భారత్ లో కరోనా సెకండ్ వేవ్ తరువాత కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. కానీ.. దక్షిణాఫ్రికా దేశంలో పుట్టిన కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పలు దేశాలతో పట్టు ఇండియాలోకి కూడా ప్రవేశించింది. భారత్ లోని పలు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్నాయి.
ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. దేశ వ్యాప్తంగా తాజాగా 1,61,386 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా గడిచిన 24 గంటల్లో 2,81,109 మంది కరోనా నుంచి కోలుకుని ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 16,21,603 కరోనా కేసులు యాక్టీవ్ గా ఉన్నాయి. దీనితో పాటు పాజిటివిటీ రేటు 9.26 శాతం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.