CM KCR to recover quickly from illness says Governor Tamilisai Soundararajan.
సీఎం కేసీఆర్ అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఇవాళ ఉదయం సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి ఆయన వెళ్లారు. నిన్నటి నుంచి ఎడమ చేయి, నొప్పిగా అనిపిస్తోందని.. నీరసంగా ఉన్నారని సీఎంవో వర్గాలు చెప్పాయి. ఈ నేపథ్యంలో డాక్టర్ ఎంవీ రావు నేతృత్వంలోని వైద్యుల బృందం ఆయనకు పలు వైద్య పరీక్ష నిర్వహించారు. సీఎం కేసీఆర్ కు హార్ట్ యాంజియోగ్రామ్, సిటీ స్కాన్ పరీక్షలు చేశారు. కేసీఆర్ సతీమణి శోభ, మంత్రి కేటీఆర్, కూతురు కవిత, సంతోష్, హరీష్ రావు, మనవడు హిమాన్షు కూడా ఆస్పత్రికి వెళ్లారు. సీఎం ఫ్యామిలీ మొత్తం అక్కడే ఉండడంతో కార్యకర్తల్లో కొంత ఆందోళన నెలకొంది.
ఐతే ఎలాంటి సమస్యా లేదని చెప్పడంతో.. అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర గవర్నర్ తమిళసై ట్విట్టర్ వేదిక..’ కేసీఆర్ ఆనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్లిన విషయం తెలిసి ఆందోళన చెందాను. కేసీఆర్ గారు ఆరోగ్యంగా ఉండాలి. ఆయన తొందరగా కోలుకోవాలి’ అని ట్విట్ చేశారు. ఆయన ప్రస్తుం కేసీఆర్‌ను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఓ వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు కేసీఆర్‌కు సూచించారు.