Today Morning CM KCR Joined at Yashoda Hospital for For illness. And CM KCR Discharged from hospital after all Medical Test.
సీఎం కేసీఆర్ ఈ రోజు స్వల్ప అస్వస్థతకు లోనవడంతో ఆయనను వెంటనే యశోద ఆసుపత్రికి తరలించారు. అయితే రెండు రోజులుగా కేసీఆర్ నీరసంగా ఉన్నారని, ఆయన ఎడమ చేయి లాగుతోందని చెబుతున్నారని వైద్యులు తెలిపారు. సీఎం కేసీఆర్‌కు వైద్యులు సిటీ స్కాన్, యాంజియోగ్రామ్ పరీక్షలు నిర్వహించినట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. ఈ సందర్భంగా కేసీఆర్ ఆరోగ్యంపై వైద్యులు మాట్లాడుతూ.. ఆయనకు లెఫ్ట్ హ్యాండ్ దగ్గర నొప్పిగా ఉందన్నారని, అందుకే పరీక్షలు నిర్వహించి కరోనరీ యాంజియోగ్రామ్ చేశామన్నారు.
ఎలాంటి బ్లాక్స్ లేవని వైద్యులు స్పష్టం చేశారు. అయితే నేడు సీఎం కేసీఆర్ యాదాద్రి పర్యటనకు వెళ్లాల్సి ఉండగా.. ఆయన ఆనారోగ్యం కారణంగా ఆ పర్యటన రద్దయింది. ఆయనకు అన్ని పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆరోగ్యంగా ఉన్నారని పేర్కొన్నారు. దీంతో ఆసుపత్రి నుంచి సీఎం కేసీఆర్ డిశ్చార్జ్ అయ్యారు. ఆయన ప్రస్తుతం ప్రగతి భవన్‌కు చేరుకున్నారు. వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచించినట్లు తెలుస్తోంది.