సీఎం కేసీఆర్ ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో 90 వేల ఉద్యోగాల భర్తీ చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలసిందే. ఈ నేపథ్యంలో ఈ నియామక ప్రక్రియకువేగంగా సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే ఇప్పటికే తొలి విడతగా 30,453 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే తాజాగా మరో 3,334 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు జారీ చేసింది. అంతేకాకుండా ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఉత్తర్వులను ఆయా శాఖలకు జారీ చేసింది. ఫైర్ సర్వీసు, ప్రోహిబిషన్…
ఏలూరు జిల్లాలోని ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెం పోరస్ కెమికల్ కంపెనీలో బుధవారం అర్థరాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా 13 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను నూజివీడులోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే మృతుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉందని వైద్యులు సూచించారు. యూనిట్-4లో గ్యాస్ లీకై మంటలు చేలరేగడంతో రియాక్టర్ పెద్ద శబ్దంతో పేలింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, ఆసుపత్రికి తరలిస్తుండగా మరొకరు మృతి…
మజ్లిస్ కీలక నేత, తెలంగాణ అసెంబ్లీలో ఆ పార్టీ శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ ద్వేషపూరిత ప్రసంగం కేసులో భారీ ఊరట లభించింది. 2012 డిసెంబర్లో హిందువులను ఉద్దేశించి అక్బర్ తీవ్ర వ్యాఖ్యలుచేశారు. నిజామాబాద్, నిర్మల్‌లో చేసిన వ్యాఖ్యలపై ఒక వర్గం తీవ్రంగా స్పందించింది. ఆయన పై కేసులు నమోదయ్యాయి. అక్బరుద్దీన్‌పై రెండు కేసులనూ నాంపల్లి సెషన్స్ కోర్టు బుధవారం నాడు కొట్టవేస్తున్నట్లు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో 2012 డిసెంబర్ నెలాఖరులో ఆదిలాబాద్,…
ఉద్యోగుల పరస్పర బదిలీలపై జీఓ 402ను సస్పెండ్ చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని యుయస్పీసి స్టీరింగ్ కమిటీ డిమాండ్ చేసింది. ఉద్యోగుల లోకల్ క్యాడర్ కేటాయింపు నిబంధనలపై సంఘాలతో సంప్రదింపులు జరపకుండా ఏకపక్షంగా జీఓ నెం 317ను విడుదల చేసిన కారణంగా నష్టపోయిన ఉపాధ్యాయులు, ఉద్యోగులకు న్యాయం చేయటానికి పరస్పర బదిలీలకు అనుమతించాలని యుయస్పీసి పక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరామని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ స్టీరింగ్ కమిటీ సభ్యులు వెల్లడించారు. ఈ…
సీఎ కేసీఆర్ అధ్యక్షతన నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం జరిగింది. కేబినెట్ సమావేశం అనంతరం సీఎం కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పలు ప్రకటనలు చేశారు. ఇటీవల అసెంబ్లీలో ప్రకటించిన విధంగా 111 జీవోను ఎత్తివేసేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. అంతేకాకుండా విద్యుత్ 2023 నాటికి 5600 మెగా వాట్స్ అందుబాటులోకి రాబోతుందని ఆయన ఆయన వెల్లడించారు. నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తున్నామని, ఉచిత సాగు నీరు అందిస్తున్నామన్నారు. ఎకరానికి…
అసలే కరోనా కాలం…. హాస్పిటల్ అంటేనే భయపడే కాలం… అలాంటి వాటిలో పని చేసేందుకు ఎవరు ముందుకు రారు.. అలాంటిది వారు ముందుకు వచ్చారు…. మొదట్లో మీకు ఇన్ని పని గంటలు… ఇంత జీతం అని పనిలో చేర్చుకొని… తీరా పని చేసిన తర్వాత చేతులెత్తేశారు… జీతాలు ఇవ్వకుండా చేతులేత్తేసింది ఎక్కడో ప్రైవేట్ కంపెనీ కాదు… ప్రభుత్వమే… గాంధీ హాస్పిటల్ లో కరోనా కోసం అని కాంట్రాక్ట్ ఎంప్లాయిస్‌ని తీసుకున్నారు… రోజుకు 500 రూపాయిల చొప్పున నెలకు…
కరోనా రక్కసి కొత్తకొత్త వేరియంట్లతో ప్రజలపై విరుచుకుపడుతోంది. దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ వేరియంట్ నుంచి సబ్ వేరియంట్లు పుట్టుకోస్తున్నాయి. డెల్టావేరియంట్ కంటే వేగంగా వ్యాప్తి చెందే శక్తి ఒమిక్రాన్ వేరియంట్లకు ఉంది. అయితే మొన్నటికి మొన్న ఒమిక్రాన్ వేరియంట్ భారత్‌లోకి ప్రవేశించి పలు రాష్ట్రాల్లో వ్యాప్తి చెందుతుండడంతో వెంటనే అప్రమత్తమైన ఆయా రాష్ట్రాలు కోవిడ్ నిబంధనలు కఠినతరం చేయడమే కాకుండా, నైట్ లాక్డౌన్, వీకెండ్ లాక్డౌన్ ను విధించి థర్డ్‌వేవ్‌కు అడ్డుకట్టవేశాయి. అయితే ఇప్పుడు ఒమిక్రాన్…
మంత్రి వర్గం కూర్పు ఈ రోజు సాయంత్రానికి ఒక కొలిక్కి రానుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ సామాజిక వర్గాల సమీకరణాల ఆధారంగా మంత్రి వర్గ సభ్యుల ఎంపిక పూర్తి చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా చివరి నిమిషంలో సీఎం జగన్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం.ఏపీలో కొత్త కేబినెట్ ఏర్పాటు ప్రక్రియలో భాగంగా పాత మంత్రుల రాజీనామాలు శనివారం రాత్రి గవర్నర్ కార్యాలయానికి చేరుకున్నాయి. నేడు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ 24 మంది మంత్రుల రాజీనామాలను ఆమోదించారు.…
సీనియర్ నటుడు, దర్శక, నిర్మాత, కథకుడు బాలయ్య మృతికి దేశ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంతాపం తెలిపారు. ”ప్రముఖ తెలుగు సినిమా నటుడు శ్రీ బాలయ్య గారు పరమపదించారని తెలిసి విచారించాను. ఉన్నత సంప్రదాయాలను పాటిస్తూ ఉత్తమ నటుడిగా పేరు సంపాదించుకున్న మంచి మనిషి ఆయన. శ్రీ బాలయ్య గారు నటుడిగానే గాక నిర్మాతగా, దర్శకునిగా అనేక మంచి చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిస్తూ వారి కుటుంబ సభ్యులకు సానుభూతి…
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఇసుక సంపదను కర్ణాటకకు చెందిన కొందరు అక్రమార్కులు యథేచ్ఛగా కొల్లగొడుతూ సొమ్ము చేసుకుంటున్నారు… తాజాగా వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం నావంద్గీ గ్రామ అ సమీపంలో ఉన్న కాగ్నానది పరివాహక ఈ ప్రాంతంలో పక్కనే ఆనుకుని ఉన్న కర్ణాటక రాష్ట్రానికి చెందిన కొందరు ఇసుక వ్యాపారులు తెలంగాణ ప్రాంతంలోకి చొరబడి ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు అన్న విషయాన్ని తెలుసుకున్న బషీరాబాద్ మండలం రెవెన్యూ సిబ్బంది అక్కడికి చేరుకొని అక్రమంగా తెలంగాణ ప్రాంతంలో తవ్వకాలు…