ఓవైపు కలలో కూడా వాహనదారులను పెట్రోల్, డీజిల్ ధరలు ఆందోళనకు గురిచేస్తుంటే.. మరోవైపు పెట్రోల్ బంకులు కూడా మోసాలకు పాల్పడుతూ.. సామాన్యుడి జేబుకు చిల్లుపెడుతున్నాయి. పెట్రోల్ బంకుల్లో మోసాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే సుంకాలతో వాహనాలను రోడ్డుపైకి తీసుకువద్దామంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి దాపురించింది. అయితే ఆఫీసుకు వెళ్లాలన్నా, నిత్యావసరాలకు బైకో, కారో బయటకు తీస్తే.. బంకుల్లో జరిగే మోసాలకు జేబుల్లో ఉన్న డబ్బంతా ఖాళీ అవుతోంది. ఇలాంటి ఘటనే హైదర్‌గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్…
ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడి వేడికి ఎన్ని నీళ్లు తాగిన చెమట రూపంలో బయటకు వస్తూనే ఉన్నాయి. దీంతో నీరసం. అయితే ఎండవేడిమి నుంచి ఉపశమనం కోసం ఫ్రూట్ జ్యాస్ తాగుదామని ఓ వ్యక్తి సమీపంలోని రిలయన్స్ స్టోర్‌కు వెళ్లాడు. స్టోర్‌లోని ఫ్రిజ్‌లో నుంచి ఓ ఫ్రూట్ జ్యూస్ తీసుకొని.. బిల్లు చెల్లించాడు. తీరా ఫ్రూట్ జ్యూస్‌ను ఆస్వాదిద్దామని ఓపెన్ చేసే సరికి ఫ్రూట్ జ్యాస్ బాటిల్లో పురుగులు దర్శనమిచ్చాయి. దీంతో ఒక్కసారిగా అవాక్కయిన సదరు వ్యక్తి ఫుడ్…
రఘురామకృష్ణంరాజు అరెస్టు వ్యవహారం సీబీఐతో విచారణ జరపాలన్న కేసుపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇదంత ముఖ్యమైన విషయమా..? అని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ముఖ్యమైన విషయం ఉంటే రాత్రి 8 గంటలకు సైతం విచారిస్తామని, ఇప్పటికే 11 నెలలు గడిచింది కదా అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. రఘురామకృష్ణ రాజు అరెస్ట్ వ్యవహారంపై సీబీఐ విచారణ జరపాలని ఆయన తనయుడు భరత్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో పిటిషన్లపై రెండు వారాల్లో కౌంటర్ అఫిడవిట్ దాఖలు…
ధాన్యం కొనుగోళ్లపై టీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కేంద్రంకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలో నిర్వహించిన టీఆర్ఎస్ నిరసన కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ పార్టీ, కేంద్ర ప్రభుత్వ వైఖరి వల్లే తెలంగాణ రైతులకు ఈపరిస్థితి వచ్చిందని ఆయన ఆరోపించారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి చూసి కేంద్రం, బీజేపీ ఓర్వలేకనే 2 సంవత్సరాల నుండే మోడీ ప్రభుత్వం రైతులను ఇబ్బంది…
కలుషిత నీరు తాగి 20 మంది అస్వస్థతకు గురైన ఘటన హైదరాబాద్ మాదాపూర్‌లోని గుట్టలభేగంపేట్ వడ్డెర బస్తీలో చోటు చేసుకుంది. కలుషిత నీరు తాగడం వలనే బస్తీలో భీమయ్య అనే వ్యక్తి మృతి చెందాడని బస్తీ వాసుల ఆరోపణ చేస్తున్నారు. కలుషిత నీరు తాగడం వలన రాత్రి నుండి వాంతులు, విరేచనాలతో దాదాపు 20 మంది హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారని బస్తీవాసులు వెల్లడించారు. కలుషిత నీటిపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని స్థానికుల ఆవేదన…
బ్యాంకులను మోసంచేసి మనీలాండరింగ్‌కు పాల్పడ్డారన్న అభియోగంపై పీసీహెచ్ గ్రూప్ డైరెక్టర్ బల్వీందర్ సింగ్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. పీసీహెచ్ గ్రూప్ సంస్థల పేరిట.. బల్వీందర్ సింగ్ వివిధ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని సుమారు 370 కోట్ల రూపాయల మోసానికి పాల్పడ్డారని చెన్నై, బెంగళూరులో సీబీఐ గతంలో కేసులు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పీసీహెచ్ గ్రూపునకు చెందిన రూ.6.18కోట్ల ఆస్తులు అటాచ్ చేసింది. హైదరాబాద్, బెంగళూరులో 11 ఆస్తులను ఈడీ…
వరంగల్ నగరంలోని బడా హోటల్స్, బేకరీలపై ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.. సుమారు 40కి పైగా షాపులలో శాంపిల్ సేకరణ జరిపారు. 8 షాప్స్ కి నోటీసులు ఇచ్చినట్లు ఫుడ్ సేఫ్టీ కంట్రోలర్ అధికారులు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆదేశాల మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు చేశామని, స్వీట్ షాప్స్, బేకరీలు, హోటల్స్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ తనిఖీ చేసారు, ఈ తనిఖీలలో 20 మంది…
తెలంగాణ ప్రభుత్వం తీరుపై గవర్నర్ తమిళిసై ఆరోపణలు చేశారు. తనను ఉద్దేశపూర్వకంగానే అవమానిస్తున్నారని.. తన విషయంలో ఏం జరుగుతోందో మీడియాకు, ప్రజలకు తెలుసునని ఆమె వ్యాఖ్యానించారు. గవర్నర్‌ను గౌరవించకున్నా.. కనీసం రాజ్‌భవన్‌ను గౌరవించాల్సి బాధత్య ఉందని ఆమె అన్నారు. అంతేకాకుండా సోదరిగా భావిస్తే ఇలా అవమానిస్తారా అని ఆమె ప్రశ్నించారు. గతంలో బీజేపీకి చెందినా ఇప్పుడు గవర్నర్ స్థాయిలో ఉన్నానని ఆమె అన్నారు. ఆమె వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. గవర్నర్ తో మాకు పంచాయితీ ఏమి…
హైదరాబాద్‌లోని ఈఎస్ఐ మెట్రో స్టేషన్ పైనుంచి ఓ యువతి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడింది. అయితే మెట్రో స్టేషన్‌పై నుంచి దూకడంతో యువతికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. బాధితురాలిని ఎస్ఆర్ నగర్ పరిధిలోని శ్రీరామ్ నగర్ చెందిన షబానాగా పోలీసులు గుర్తించారు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ యువతి మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రేమ విఫలమైనందుకే ఆ యువతి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ…
కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డిని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు మంగళవారం కలిసారు. ఈ సందర్భంగా రామగిరి కోటను పరిరక్షించాలని శ్రీధర్‌బాబు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి వినతిప్రతం అందజేశారు. 12వ శతాబ్దానికి చెందిన కోటకు సరైన రహదారి, ఇతర మౌళిక వసతులను కల్పించాలని ఆయన కోరారు. మంథని నియోజకవర్గంలోని రామగిరి కోటను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ఆయన కిషన్‌రెడ్డికి విన్నవించారు. సాంస్కృతిక వారసత్వం, ఔషధ మొక్కల కేంద్రంగా రామగిరి కోట ఉందని కేంద్రమంత్రికి శ్రీధర్‌బాబు తెలిపారు.…