సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గంలో ఈ రోజు దళిత బంధు ప్రారంభమైంది. మండలంలోని బడ్డాయిపల్లి గ్రామంలోని దళితులకు దళిత బంధు ద్వారా వచ్చిన ట్రాక్టర్ లను జేసీబీలను బొలెరో వాహనాన్ని లబ్ధిదారులకు ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అందజేశారు. అలాగే 20 మంది లబ్ధిదారులకు డైరీ కి సంబంధించి ప్రొసిడింగ్స్ ను కూడా సందర్భంగా అందజేశారు. మర్పల్లి మార్కెట్ యాడ్ లో వైభవంగా జరిగిన దళిత బంధు వాహనాల పంపిణీలో లబ్ధిదారుల తో పాటు నియోజకవర్గంలోని నాయకులు కూడా…
శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) షాకిచ్చింది. పాత్ర ఛాల్ భూ కుంభకోణంలో రౌత్ పాత్రపై గతంలో ఆరోపణలు వినిపించాయి. రూ. 1034 కోట్ల ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ (ఎఫ్ఎస్ఐ)పై విచారణకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మరియు అతని కుటుంబ సభ్యులకు చెందిన అలీబాగ్‌లోని ఎనిమిది ల్యాండ్ పార్సెల్‌లను అటాచ్ చేసింది. అంతేకాకుండా ముంబైలోని దాదర్‌లోని ఒక ఫ్లాట్‌ను తాత్కాలికంగా అటాచ్ చేసింది. పాత్ర ఛాల్ భూ…
భారత్‌పై దుష్ప్రచారానికి పెద్దపీట వేస్తున్న కొన్ని యూట్యూబ్ ఛానళ్లపై కేంద్రం కొరడా ఝుళిపించింది. భారతదేశానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న 22 యూట్యూబ్ ఛానెల్‌లను సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ బ్లాక్ చేసింది. ప్రత్యేక ఉత్తర్వుల్లో, సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ 22 ఛానెళ్లపై ఈ చర్యలు తీసుకోవాలని యూట్యూబ్‌ను ఆదేశించింది. భారత్‌పై దుష్ప్రచారం చేస్తున్న 22 యూట్యూబ్ చానళ్లపై ప్రభుత్వం నిషేధం విధించింది. కేంద్రం బ్యాన్ చేసిన వాటిలో 4 పాకిస్థాన్‌కు యూట్యూబ్ చానళ్లు ఉన్నట్లు…
తెలంగాణ విద్యాశాఖ మరో నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్, ఎడ్ సెట్ షెడ్యూల్ ను తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది. అయితే తాజాగా టీఎస్ పీఈసెట్-2022 నోటిఫికేషన్‌ను మహాత్మా గాంధీ యూనివర్సిటీ విడుదల చేసింది. తెలంగాణ స్టేట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్(టీఎస్ పీఈసెట్)ను బీపీఎడ్, డీపీఎడ్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 11వ తేదీ నుంచి ఆన్లైన్లో…
సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకం దళిత బంధు. అయితే నేడు గజ్వేల్ నియోజకవర్గంలోని కొల్గూరు గ్రామంలో 129 మందికి దళిత బంధు లబ్దిదారులకు మంత్రి హరీష్ రావు మంజూరు పత్రాలు, యూనిట్లను అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. దళిత బంధు పథకం క్రింద ఒక్కొ లబ్దిదారుడికి రూ.10 లక్షలు అందజేసిన ఘటన సీఎం కేసీఆర్‌కే దక్కుంతుందని ఆయన కొనియాడారు. అంతేకాకుండా దళితులు వ్యాపార వృద్ధి సాధించి, అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలవాలన్నారు. పార్టీలకు అతీతంగా…
సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన బ్రాడ్కాస్ట్ సేవా పోర్టల్‌ను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ రోజు ఢిల్లీలో ప్రారంభించారు. మీడియా, వినోద రంగం నిరంతరం అభివృద్ధి చెందుతోంది. ఇది 25 బిలియన్ డాలర్ల పరిశ్రమ అని, వచ్చే రెండేళ్లలో 30 బిలియన్ డాలర్లుగా మారుతుందని మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. పర్యావరణ వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం, ప్రతిస్పందనను తీసుకురావడానికి పోర్టల్ ఉపయోగపడుతుందన్నారు. త్వరలో ప్రభుత్వ ప్రధానమైన ‘జాతీయ సింగిల్…
నిలోఫర్, గాంధీ వైద్యులతో వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. విభాగాల వారీగా నెలవారీ సమీక్షలో భాగంగా ఆయన వైద్యాధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బడ్జెట్ పెరిగింది.. పనితీరు పెరగాలని ఆయన అన్నారు. ప్రభుత్వం అన్ని విధాల సహకరిస్తుందని, పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఆయన అధికారులకు, వైద్యులకు అదేశించారు. అంతేకాకుండా నవజాత శిశువుల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆయన సూచించారు. మోకాలు, తుంటి ఎముకల మార్పిడి సర్జరీలు పెరగాలని…
రోజురోజుకు కొత్తకొత్త టెక్నాలజీలతో, కొత్తకొత్త ఆలోచనలతో జపాన్ లాంటి దేశాలు ముందున్నాయి. అందుకు కారణం అక్కడి విద్యా విధానం. అయితే టెక్నాలజీలో ముందున్న దేశాల పక్కన మన భారతదేశాన్ని నిలబెట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన బాధ్యత ఉంది. అయితే ఇందుకు విద్యా విధానంలో మార్పుల తప్పనిసరి. అందుకు అనుగుణంగా రాష్ట్రాలు విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకువచ్చేందుకు అడుగులు వేయాలి. ఈ విధంగా ముందుకు వెళ్లేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆలోచనలు చేస్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు. సోమవారం…
తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ను ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది. అయితే తాజాగా ఎడ్ సెట్ షెడ్యూల్ ను విద్యా శాఖ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఎడ్ సెట్ కోసం ఈ నెల 7 నుండి దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది. అంతేకాకుండా జూన్ 15 దరఖాస్తులకు చివరి తేదీగా పేర్కొంది. దీంతో పాటు రూ.500 లేట్ ఫీ తో 15 జులై వరకు దరఖాస్తుకి అవకాశం…
ప్రతి సంవత్సరం కర్నూలు జిల్లా ఆస్పరి మండలం కైరుప్పలలో పిడకల సమరం ఆనవాయితీగా వస్తోంది. ప్రేమికులైన వీరభద్రస్వామి, కాళికాదేవిని ఒక్కటి చేసేందుకు రెండు వర్గాలు పిడకలతో హోరాహోరీగా పోరాడి, పిడకల సమరం అనంతరం పంచాయతీ జరిపి స్వామి అమ్మవార్లను ఒక్కటి చేయడం జరుగుతుంది. సుధీర్ఘ చరిత్ర ఉన్న ఈ పిడకల యుద్ధాన్ని ప్రతి ఏటా ఉగాది మురుసటి రోజు దీన్ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. కైరుప్పలలో పిడకల సమరం ఘనంగా జరుపుకున్నారు. గ్రామస్థులు రెండువర్గాలుగా విడిపోయి పిడకలతో…