సీఎ కేసీఆర్ అధ్యక్షతన నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం జరిగింది. కేబినెట్ సమావేశం అనంతరం సీఎం కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పలు ప్రకటనలు చేశారు. ఇటీవల అసెంబ్లీలో ప్రకటించిన విధంగా 111 జీవోను ఎత్తివేసేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. అంతేకాకుండా విద్యుత్ 2023 నాటికి 5600 మెగా వాట్స్ అందుబాటులోకి రాబోతుందని ఆయన ఆయన వెల్లడించారు. నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తున్నామని, ఉచిత సాగు నీరు అందిస్తున్నామన్నారు. ఎకరానికి 10 వేలు ఇస్తున్నాం ఇది భూగోళంలో ఎక్కడ లేదని ఆయన స్పష్టం చేశారు.
కరోనాతో ఇబ్బంది పడొద్దని 7 వేల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని ఆయన వెల్లడించారు. దిక్కుమాలిన పనికి మాలిన ప్రభుత్వం కేంద్రంలో ఉందని ఆయన మండిపడ్డారు. పూర్తి రైతు వ్యతిరేక ప్రభుత్వం కేంద్ర సర్కార్‌ది అంటూ ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగాన్ని కార్పోరేట్ లకు అప్పగించాలని బలమైన కుట్ర కేంద్రం చేస్తుందని ఆయన విమర్శించారు. గ్రామీణ ఉపాధిని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయరని, ఎరువుల మీద ధరలు పెంచారని ఆయన ధ్వజమెత్తారు. మోటర్లకు మీటర్లకు పెట్టాలని చెబుతున్నారని ఆయన కేంద్రంపై అ్రగహం వ్యక్తం చేశారు.
https://ntvtelugu.com/cabinet-decised-to-lift-111go/