రామయంపేటలో ఆత్మహత్య చేసుకున్న సంతోష్ కుటుంబాన్ని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మంగళవారం పరామర్శించారు. సంతోష్ కుంటుంబానికి జరిగిన నష్టం ఎవరు పూడ్చలేనిదని, ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఈ ఆత్మహత్య చేసుకొని నాలుగు రోజులు గడుస్తున్న నిందితులను అరెస్ట్ చేయకపోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు. నిందితులపై సెక్షన్ 306తో పాటు 302,307 సెక్షన్లు కూడా పెట్టాలన్నారు. ఆత్మహత్య జరిగి నాలుగు రోజులు అవుతున్న జిల్లా ఎస్పీ ఏం చేస్తున్నట్లు..? అని ఆయన ప్రశ్నించారు. ఈరోజు నిందితులను పార్టీ నుండి…
కొత్తగా నిర్మిస్తున్న తెలంగాణ సెక్రటేరియట్ పనులను మంగళవారం నాడు సీఎం కేసీఆర్ పరిశీలించారు. ప్రగతి భవన్ నుంచి సచివాలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్ కొత్త సెక్రటేరియట్ పనులను పర్యవేక్షించారు. ఆరు అంతస్థుల సెక్రటేరియట్ నిర్మాణ పనులు పూర్తవగా.. వారం రోజుల క్రితం సీఎం కేసీఆర్ సెక్రటేరియట్ పనులను పరిశీలించాల్సి ఉంది. అయితే కొన్ని కారణాలతో ఈ కార్యక్రమం రద్దు కావడంతో నేడు సెక్రటేరియట్ను సీఎం కేసీఆర్ సందర్శించారు. సెక్రటేరియట్ లో ప్రస్తుతం జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించి…
స్సెషల్ మూవీ షూటింగ్స్ లో మరిన్ని స్పెషల్స్ చోటు చేసుకుంటేనే మజా! రామ్ చరణ్ నటిస్తోన్న 15వ సినిమా నిస్సందేహంగా ఆయనకు ఓ స్పెషల్ అనే చెప్పాలి. తొలిసారి డైనమిక్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ నటిస్తోన్న చిత్రమిది. ఇక ఈ సినిమాను నిర్మిస్తోన్న దిల్ రాజు కు ఇది 50వ సినిమా కావడం మరింత విశేషం! ఈ విశేషాల నేపథ్యంలో రామ్ చరణ్ మరో స్పెషల్ ను చొప్పించారు. అదేమిటంటే, ప్రస్తుతం ఈ…
తెలంగాణలో అమ్మాయిలపై, మహిళలపై టీఆర్ఎస్ నేతలు ఆఘాయిత్యాలకు పాల్పడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాల్వాయి రజిని కుమారి నిప్పులు చెరిగారు. మంగళవారం నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో అకృత్యాలు, ఆగడాలు, అమానుష ఘటనలు జరుగుతున్నాయని, టీఆర్ఎస్ నేతలు లైసెన్స్డ్ గుండాలు గా వ్యవహరిస్తున్నారని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. అమ్మాయిలు ఎలా కనిపిస్తున్నారు మీకు… భార్యలను తీసుకురమ్మని అంటున్న సిగ్గు శరం లేని నేతలు…
తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్లోని 18 ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులతో పాటు వచ్చే అటెండర్లు మరియు బంధువులకు రూ.5కే భోజనం అందించనున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆరోగ్య అధికారులు, హరే కృష్ణ మూవ్మెంట్ (హెచ్కెఎం) మధ్య ఎంఓయు కుదిరింది. నగరంలోని ప్రభుత్వ తృతీయ ఆసుపత్రులలో రోగులతో పాటు వారి బంధువులకు, ప్రత్యేకించి దీర్ఘకాలం పాటు దీర్ఘకాలిక రోగులతో పాటు వచ్చే వారికి రూ.5కే పరిశుభ్రమైన భోజనం అందించనున్నారు. ప్రతి…
తెలంగాణ గవర్నర్ తమిళిపై సౌందరరాజన్ ప్రొటోకాల్ వ్యవహారం హాట్టాపిక్గా మారిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఢిల్లీలో గవర్నర్ తమిలిసై మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయం చేస్తున్నానని అనవసరంగా విమర్శిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఆధారాలు లేకుండా విమర్శిస్తున్నారని, తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా విమర్శించారని ఆయన ఆరోపించారు. పాత వీడియోలతో సోషల్ మీడియాలో ట్రోల్ చేశారని, నేను ప్రజల సమస్యలను పరిష్కరించటం తప్పా అని ఆమె ప్రశ్నించారు. ప్రజలను కలిస్తే తప్పుగా అర్ధం చేసుకుంటున్నారని, ఏ పదవిలో ఉన్నా,…
తాత గుణాలు మనవడికి రాకుండా పోవు అంటారు. అందునా తల్లివైపు తాత లక్షణాలు వస్తే మరింత మంచిదనీ చెబుతారు. బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూతురు శ్వేతా నందా కొడుకు అగస్త్య కూడా తాతబాటలో పయనించాలని డిసైడ్ అయ్యాడు. స్కూల్ చదువుతున్న రోజుల్లోనే నటనలో శిక్షణ తీసుకున్నాడు అగస్త్య. అమితాబ్ బచ్చన్ ను సూపర్ స్టార్ గా నిలపడంలో జంట రచయితలు సలీమ్-జావేద్ పాత్ర ఎంతయినా ఉంది. ఈ రచయితల్లో ఒకరైన జావేద్ అక్తర్ కూతురు జోయా…
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పవిత్ర పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న కాళేశ్వరం త్రివేణి సంగమానికి భక్తుల తాకిడి కొనసాగుతుంది. ప్రాణహిత పుష్కరాల 6వ రోజు సందర్భంగా కాళేశ్వరానికి భక్తుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టింది. తెలుగు రాష్ట్రాలతోపాటు మహరాష్ట్ర, ఛత్తీస్ గఢ్, ఒరిస్సా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుండి భక్తులు కాళేశ్వరం చేరుకొని త్రివేణి సంగమ గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరించారు. నదిమా తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ.. దీపాలు వదులుతున్నారు. తీరంలో పురోహితులతో పిండ, శ్రాద్ధ కర్మ పూజలు నిర్వహిస్తున్నారు.…
NTV Specials : రాజన్న.. ఈ ‘వీఆర్ఏ’ పరిస్థితి ఎందన్న.. పేదల దైవంగా.. కోరిన కోర్కెలు తీర్చే కోడె మొక్కుల దేవుడు శ్రీరాజరాజేశ్వర స్వామి పుణ్యక్షేత్రంలోనే ఓ అవమానీయ ఘటన వెలుగులోకి వచ్చింది. రాజన్న సిరిసిల్ల జిల్లా. రెవెన్యూ విభాగంలో వీఆర్ఏగా పనిచేస్తున్న ప్రశాంత్ అధికారుల ఆదేశాలతో ప్రతిరోజు ఉదయం వేములవాడలోని ఆర్డీవో కార్యాలయాన్ని శుభ్రం చేసి తిరిగి తన విధులకు వెళ్తున్నాడు. వేములవాడలో ఆర్డీవో కార్యాలయం ఏర్పాటు చేసి దాదాపు 10 నెలలు గడుస్తున్నా సిబ్బందిని…
ఈ నెల 27న టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకను హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో నేడు హెచ్ఐసీసీలో ఆవిర్భావ సభ సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల నేతలతో కేటీఆర్ సమావేశమయ్యారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ ఏర్పాట్లపై సలహాలు, సూచనలు స్వీకరించామని, ప్లీనరీని విజయవంతం చేయడానికి కొన్ని కమిటీలను ఏర్పాటు చేసుకోవడం…