తమిళనాడుకు చెందిన 18 ఏళ్ల టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడు విశ్వ దీనదయాళన్ ఆదివారం గౌహతి నుండి షిల్లాంగ్‌కు టాక్సీలో వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (TTFI) ఒక ప్రకటనలో తెలిపింది. 83వ సీనియర్ జాతీయ, అంతర్ రాష్ట్ర ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు షిల్లాంగ్‌కు విశ్వ దీనదయాళన్ తన ముగ్గురు సహచర క్రీడాకారులతో కలిసి గౌహతి నుండి షిల్లాంగ్‌కు కారులో ప్రయాణిస్తుండగా, ఎదురుగా వస్తున్న 12 చక్రాల ట్రైలర్, రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టి…
తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి తిరుపతి శ్రీవేంకటేశ్వర స్వామి వారి దర్శించుకునేందకు లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. అయితే వారంతంలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. అయితే వివిధ ప్రాంతాల నుంచి వారాంతంలో తిరుపతికి వెళ్లే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. సెలవు రోజుల్లో అదనపు రద్దీని క్లియర్ చేయడానికి, దక్షిణ మధ్య రైల్వే (SCR)…
గచ్చిబౌలిలోని అన్వయ కన్వెన్షన్ సెంటర్లో తెలంగాణ న్యాయాధికారుల సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సదస్సులో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ పై సీజేఐగా జస్టిస్ ఎన్వీ.రమణకు ప్రేమ, అభిమానం ఉంది కాబట్టే ఎన్నో రోజులుగా పరిష్కారంకాని సమస్యలను పరిష్కరించారన్నారు. ‘ఉమ్మడి హైకోర్టు విడిపోయాక బెంచీల సంఖ్య పెంపుపై గతంలో కేంద్రానికి, ప్రధాని మోదీకి లేఖ రాశాను. కానీ.. ఆ అంశం పెండింగ్ లోనే ఉండిపోయింది’. ‘సీజేఐగా ఎన్వీ రమణ బాధ్యతలు చేపట్టాక…
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో వైద్య పరికరాల తయారీ, మెడ్-టెక్ ఆవిష్కరణలకు పెద్దపీట వేస్తోంది. ఆసియాలోనే అతి పెద్ద స్టెంట్ తయారీ కేంద్రం మన హైదరాబాద్‌లో రెడీ అయ్యిందని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా సూల్తాన్‌పూర్‌లో సిద్ధమైన సహజానంద్ మెడికల్ టెక్నాలజీ పార్కుని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ నేడు ప్రారంభించనున్నారు. సుల్తాన్‌పూర్‌లో మెడికల్ డివైజ్ పార్కుని 302 ఏకరాల్లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ ప్రాంగణంలో ఇప్పటికే అనేక కంపెనీలు…
కరోనా మహమ్మారి మలేషియా దేశంలో విలయ తాండవం చేస్తోంది. అక్కడ నిన్న ఒక్కరోజు 10 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. మలేషియా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం.. గురువారం అర్ధరాత్రి నాటికి మలేషియాలో 10,413 కొత్త కోవిడ్ ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటివరకు కోవిడ్ బాధితుల సంఖ్యం 43,63,024కు చేరుకుంది. అయితే వీటిలో విదేశాల నుంచి వచ్చిన వారు 27 మంది ఉండగా, స్వదేశంలో 10,386 మందికి ఈ కరోనా సోకినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ…
వేసవికాలం భానుడి తాపానికి ప్రజలందరూ చెమటలు కక్కుతున్నారు. సూర్యోదయం నుంచే కూలర్లు, ఏసీలు తిరుగుతూనే ఉన్నాయి. అయితే భానుడి భగభగ నుంచి కూల్ చేసే విషయాన్ని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజులు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రాంలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో గంటకు…
ఏలూరు జిల్లాలోని ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెం పోరస్ కెమికల్ కంపెనీలో బుధవారం అర్థరాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా 13 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో సంఘటన స్థలాన్ని ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పోరస్ మృతులకు ప్రభుత్వం వైపు నుంచి రూ. 25 లక్షలు.. కంపెనీ వైపు నుంచి రూ. 25 లక్షలు నష్టపరిహరం అందజేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. తీవ్ర క్షతగాత్రులకు…
మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి హనుమంతరావు రావు ఇంటి పైన దుండగుల దాడిని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ నేపథ్యంలో హనుమంతరావుతో రేవంత్ రెడ్డి ఫోన్లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వి.హనుమంతరావు ఇంటిపై దుండగులు అర్ధరాత్రి దాడి చేసి రాళ్లు వేయడంతో ఇంటి అద్దాలు.. కారు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనపై రేవంత్ రెడ్డి స్పందిస్తూ… తెలంగాణలో రోజు రోజుకూ శాంతి భద్రత లు…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకేటేశ్వర్ రావు కూతురు ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సారపాకలో గల ఇంటిలో తాటి వెంకేటేశ్వర్ రావు కూతురు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తాటి వెంకేటేశ్వర్ రావు కూతురు మహాలక్ష్మి ఎంబీబీఎస్ పూర్తి చేసింది. ప్రస్తుతం పోస్ట్ గ్రాడ్యుయేషన్ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతుంది.. సారపాకలో ఇంటి లో ఆత్మహత్య చేసుకోగా, పోలీసులు మృత దేహాన్ని భద్రాచలం ఆసుపత్రికి…
సర్వదర్శన భక్తులకు టీటీడీ అధిక ప్రాధాన్యత ఇచ్చింది. నిన్న శ్రీవారిని 88,748 మంది భక్తులు దర్శించుకున్నారు. కోవిడ్ తరువాత నిన్న రికార్డ్ స్థాయిలో శ్రీవారిని భక్తులు దర్శించుకున్నారు. సర్వదర్శన క్యూ లైను ద్వారా స్వామివారిని దర్శించుకున్న 46,400 మంది భక్తులు దర్శిచుకున్నారు. దీంతో పాటు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన క్యూ లైను ద్వారా 25,819 మంది భక్తులు దర్శించుకోగా, వర్చువల్ సేవా టిక్కేట్లు, సేవా టికెట్లు, టూరిజం శాఖ కేటాయింపులు ద్వారా 16,529 మంది…