Malaysia : కరోనా విలయ తాండవం.. ఒక్కరోజే 10,413 కేసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా మహమ్మారి మలేషియా దేశంలో విలయ తాండవం చేస్తోంది. అక్కడ నిన్న ఒక్కరోజు 10 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. మలేషియా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం.. గురువారం అర్ధరాత్రి నాటికి మలేషియాలో 10,413 కొత్త కోవిడ్ ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటివరకు కోవిడ్ బాధితుల సంఖ్యం 43,63,024కు చేరుకుంది. అయితే వీటిలో విదేశాల నుంచి వచ్చిన వారు 27 మంది ఉండగా, స్వదేశంలో 10,386 మందికి ఈ కరోనా సోకినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అంతేకాకుండా మరో 18 మరణాలు నమోదయ్యాయి. దీంతో మరణాల సంఖ్య 35,381కి చేరుకుంది.
వీటితో పాటు 13,202 మంది గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి కోలుకోగా, ఇప్పటివరకు డిశార్చ్ అయినవారి సంఖ్య 4,209,858గా ఉంది. ప్రస్తుతం మలేషియా దేశ వ్యాప్తంగా 1,17,785 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 154 మంది ఇంటెన్సివ్ కేర్‌లో ఉండగా, వారిలో 89 మందికి సహాయక శ్వాస అవసరం ఉంది. అయితే రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండడంతో అక్కడ కోవిడ్ నిబంధనలు కఠినతరం చేశారు. చైనాలో సైతం ఒమిక్రాన్ వేరియంట్ ఎల్452ఆర్ మ్యుటేషన్ వ్యాప్తి చెందుతుండడంలో, శాంఘై సిటీలో లాక్‌డౌన్ విధించారు. దీంతో శాంఘై నగరంలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Also Read
తాజావార్తలు
-
US-Iran: హార్ముజ్ తెరుచుకుంటుందా? అమెరికా కీలక ప్రకటన
-
Varun Tej Leg Injury: ఆ ఒక్క గాయం వరుణ్ తేజ్ జీవితాన్ని మార్చేసిందట..!
-
Chandipura virus: 22 మంది చిన్నారులు మృతి.. ఏమిటి చండీపుర వైరస్.? మెదడుపై ఎలా దాడి చేస్తుంది.?
-
Udhayanidhi Stalin Case: ఉదయనిధి స్టాలిన్ కేసులో హైడ్రామా.. పోలీస్ వ్యాన్ దిగేందుకు నిరాకరణ.. ఉత్కంఠ..!
-
ఆ కార్యాలయాలకు టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలు.. సెప్టెంబర్ 1 తర్వాత బిల్లులు చెల్లించొద్దు: మంత్రి శ్రీధర్ బాబు
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!