మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి హనుమంతరావు రావు ఇంటి పైన దుండగుల దాడిని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ నేపథ్యంలో హనుమంతరావుతో రేవంత్ రెడ్డి ఫోన్‌లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వి.హనుమంతరావు ఇంటిపై దుండగులు అర్ధరాత్రి దాడి చేసి రాళ్లు వేయడంతో ఇంటి అద్దాలు.. కారు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనపై రేవంత్ రెడ్డి స్పందిస్తూ… తెలంగాణలో రోజు రోజుకూ శాంతి భద్రత లు క్షిణిస్తున్నాయని ఆయన మండిపడ్డారు.
దోషులను పోలీసులు వెంటనే గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. వి.హనుమంతరావు ప్రజల మనిషి ఎవరి ఆపద వచ్చిన ముందుంటారు అలాంటి వ్యక్తిపై దాడి ఏమిటని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులకు పోలీసులు మరింత భద్రత కల్పించాలని ఆయన కోరారు. కాంగ్రెస్ నాయకులపై దాడులు జరిగితే ఊరుకునేది లేదని, దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.