టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావుతో ఎన్టీవీ ఫేస్ టు ఫేస్ నిర్వహించింది. ఈ నేపథ్యంలో అపర చాణిక్యుడైన కేసీఆర్‌కు ప్రశాంత్ కిషోర్ సాయం ఎందుకు కావాల్సి వచ్చిందనే ఎన్టీవీ ప్రశ్నకు కేటీఆర్ సమాధానం ఇస్తూ.. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన నాడు 10 సంవత్సరాలు ఉన్న బాలుడు, రాబోయే సంవత్సరం, రెండు సంవత్సరాల్లో ఓటరు కాబోతున్నాడు. ఆ బాలుడికి కేసీఆర్ ఉద్యమ నాయకుడి కాకుండా ముఖ్యమంత్రిగానే తెలుసు అని, జనరేషన్ మారుతున్న కొద్దీ,…
వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది హైదరాబాద్‌లోని ప్రిజం పబ్. అయితే ఇప్పటికే పలు ఘటనల్లో ప్రిజం పబ్‌కు సంబంధం ఉంది. తాజాగా మరోసారి కస్టమర్‌పై దాడి చేసి ప్రిజం పబ్ వార్తల్లో నిలిచింది. పబ్‌కు వచ్చిన నంద కిషోర్ అనే వ్యక్తిపై ప్రిజం పబ్ బౌన్సర్లుతో కలిసి యాజమాన్యం పిడిగుద్దులు కురిపించారు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో నందకిషోర్ ఎన్టీవోతో మాట్లాడుతూ.. ‘మొదటిసారి ప్రిజం పబ్ కి వెళ్ళాను. అక్కడ నాన్ స్మోకింగ్ జోన్…
ఆర్మూర్ ఎమ్మెల్య జీవన్ రెడ్డి కాంగ్రెస్, బీజేపీ నేతలపై విమర్శలు గుప్పించారు. ఆదివారంయన నిజామాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌లో జేబులు కట్ చేసి నిజామాబాద్ ఎంపీ బ్లేడ్ బాబ్జీగా మారాడని, అందుకే గొంతు కోసుకుంట అంటున్నారని ఎంపీ ధర్మపురి అర్వింద్ చేసిన వ్యాఖ్యలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బీజేపీ అంటేనే బ్రోకర్ల పార్టీ అనీ రానున్న ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. గతంలో బండ్ల గణేశ్‌కు పట్టినగతే…
మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే ఇంటి ముందు హనుమాన్ చాలీసా పఠిస్తామని అమ్రావతి ఎంపీ నవనీత్ కౌర్‌తో పాటు ఆమెభర్త రవి రాణాలు ప్రకటించిన విషయం తెలిసిందే. హనుమాన్ జయంతి సందర్భంగా మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే హనుమాన్ చాలీసా పఠించాలని, లేకపోతే తామే సీఎం ఇంటి ఎదుట హనుమాన్ చాలీసా పఠిస్తామని ఎంపీ నవనీత్ కౌర్ రాణా, ఆమె భర్త, ఎమ్మెల్యే రవి రాణాలు గతంలో ప్రకటించారు. ఈ నేపథ్యంలో సీఎం ఇంటి ముందు ఇలాంటివి…
గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్‌కు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి శనివారం బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ నేతలు, ఇతర ప్రయివేటు వైద్య, విద్య కళాశాల్లో పీజీ సీట్ల దందాపై చర్యలు కోరుతూ రేవంత్ రెడ్డి లేఖను రాశారు. అయితే ప్రయివేటు వైద్య కళాశాలలు సీట్లను బ్లాక్ చేసి కోట్ల రూపాయలు దండుకుంటున్నాయన్నారు. వైద్య సీట్ల దందాలో మంత్రులు కూడా భాగస్వామ్యం కావడం దారుణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రులు మల్లారెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్,…
కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు నిధులు ఇచ్చిందని బీజేపీ నేతలు అంటుంటే.. ఇవ్వలేదని టీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ విషయమై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ధర్నా చేసే అధికారం టీఆర్ఎస్కి మాత్రమే ఉందా అని ఆయన వ్యాఖ్యానించారు. సకుటుంబ సపరివారంగా ఢిల్లీలో ధర్నా చేస్తే మేమేమి అడ్డుకోలేదు కదా.. అని ఆయన ప్రశ్నించారు. ప్రతి రోజు ఈ తండ్రి కొడుకుల ప్రభుత్వం కేంద్రంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. హైదరాబాద్ ప్రజలు డ్రైనేజీ…
వేసవికాలం తాపంతో సతమతమవుతున్న తెలంగాణ వాసులకు హైదరాబాద్ వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. భానుడి ప్రతాపానికి వేసవికాలం ప్రారంభం నుంచి ఎండతీవ్రత అధికంగా ఉండటంతో ప్రజలు చెమటలు కక్కుతున్నారు. ఉదయం 9 నుంచే ఇంటి నుంచి బయటకు రావాలంటే భయపడుతున్న ప్రజలపై వరుణుడు నిన్న కరుణించి వర్షం కురిపించడంతో ఉక్కపోత నుంచి కొంత ఉపశమనం లభించింది. అయితే ఈ రోజుల కూడా మధ్యాహ్నం నుంచి హైదరాబాద్ వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో…
మహబూబాబాద్ కౌన్సిలర్ రవిని హత్య కేసును పోలీసులు 24 గంటల్లోనే చేధించారు. హత్యతో సంబంధం ఉన్న 7గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ హత్యలో వినయ్, అరుణ్ ప్రధాన నిందితులుగా మిగిలిన ఐదుగురు వారికి సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. భూక్యా వినయ్ కుమార్, భూక్యా అరుణ్, అజ్మిరా బాలరాజు, గుగులోతు చింటూ, కారపాటి సుమంత్, అజ్మిరా కుమార్, గుగులోతు భావు సింగ్‌లు నిందితులుగా పోలీసులు వెల్లడించారు. వారి నుండి మారునాయుధాలు గొడ్డలి, తల్వార్, ట్రాక్టర్, కారును…
భానుడి భగభగతో తెలంగాణ రాష్ట్రం అట్టుడికిపోతోంది. ఉదయం నుంచే సూర్యడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. వేసవికాలం ప్రారంభం నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపుతుండడంతో తెలంగాణ వాసులు మధ్యాహ్నం సమయంలో ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు ఆందోళన చెందుతున్నారు. ఏప్రిల్ ప్రారంభంలో ఎండతీవ్రత అంచనాలకు మించి ఉండడంతో విద్యాసంస్థల పనివేళల్లో కూడా మార్పులు చోటు చేసుకున్నాయి. అయితే గత రెండు మూడు రోజుల నుంచి భాగ్యనగరంలో ఉక్కపోతకు ప్రజలు చెమటలు కక్కుతున్నారు. హై స్పీడ్‌లో ఫ్యాన్లు, కూలర్లు,…
మహబూబాబాద్ జిల్లా లో దారుణం చోటుచేసుకుంది. మహబూబాబాద్ 8వ వార్డు కౌన్సిలర్ బానోత్ రవినాయక్ దారుణ హత్యకు గురయ్యారు. గురువారం ఉదయం 11 గంటల సమయంలో మహబూబాబాద్ పట్టణంలోని పత్తిపాక ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. పత్తిపాకలో నూతనంగా నిర్మించుకుంటున్న ఇంటి పనులను పరిశీలించేందుకు వెళ్లిన రవినాయక్‌పై కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు గొడ్డళ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. మెడ భాగంలో దాడి జరగడంతో రవి తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో రవిని చికిత్స నిమిత్తం స్థానికులు ఏరియా…