మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో మంత్రులు జైల్లో ఉన్నారని వ్యాఖ్యానించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. యూపీఏ హయాంలో 12 లక్షల కోట్లు దోపిడీ చేశారన్నారు. మోడీ విద్యుత్ కోతలు లేకుండా చర్యలు తీసుకున్నారని ఆయన వెల్లడించారు. 2047 నాటికి పేదరికం లేని దేశంగా… అభివృద్ధి చెందిన దేశంగా నిర్మించుకుందామని, మెజార్టీ పార్లమెంట్ సీట్లు బీజేపీ గెలవడం ఖాయమన్నారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ గెలినేది లేదు.. ఇచ్చిన హామీలు అమలు చేసేది…
తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం గడిచిన పది ఏళ్లలో రెవెన్యూ శాఖను, యంత్రాగాన్ని, వ్యవస్థను, దుర్వినియోగ పరిచిన విధానాన్ని, జరిగిన తప్పులను సరిచేసి రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ఈ ప్రభుత్వం తగు చర్యలకు ఉపక్రమించిందని, ఆ దిశలో పటిష్టమైన విధానాన్ని రూపొందిస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో శనివారం కేరళ ప్రభుత్వ రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్…
పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు కవితకు పులే గుర్తురాలేదా? ప్రజాభవన్ కు పూలే పేరు పెట్టాక గుర్తొచ్చిందా? అన్నారు తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి. ఇవాళ ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ఐదేళ్లు మహిళలకు కేబినెట్లో అవకాశం ఇవ్వనప్పుడు.. కేసీఆర్ ను కవిత ఎందుకు ప్రశ్నించలేదు? అని ఆయన అన్నారు. పూలే ఆలోచన విధానానికి వ్యతిరేకంగా కేసీఆర్ పరిపాలన చేశారని, మహిళలకు, బీసీలకు తీరని అన్యాయం చేసింది కేసీఆర్ అని ఆయన వ్యాఖ్యానించారు. నిర్మాణత్మకంగ విమర్శలు…
వైజాగ్ వేదికగా ఇంగ్లండ్తో తలపడుతున్న టీమిండియా రెండో టెస్టు రెండు రోజు ఆధిక్యంలో నిలిచింది. భారత్ను మొదటి సెషన్లోనే ఆలౌట్ చేసి ఆ తర్వాత విజృంభించిన ఇంగ్లండ్ ఆటగాళ్లు.. తొలి ఇన్నింగ్స్లో 253 పరుగులకే ఆలౌటయ్యారు. టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా దెబ్బకు ఆరు వికెట్ల (6/45)ను సమర్పించుకున్నారు. ఇదే కోవలో కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు (3/71) తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో.. 253 రన్స్కే ఇంగ్లండ్ ఆలౌట్ అవడంతో తొలి ఇన్నింగ్స్లో భారత్కు…
తెలంగాణ అసెంబ్లీలో జ్యోతిరావు పూలే విగ్రహాన్ని పెట్టాలని కవిత అనడం విడ్డూరంగా ఉందని, కవిత కి ఈడి నోటీసులు వచ్చినప్పుదప్పుడల్లా కవిత కు మహిళా బిల్లు గుర్తుకొస్తుందని ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ ఫైర్ అయ్యారు.వేములవాడలో జరిగిన కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ అసెంబ్లీలో జ్యోతిరావు పూలే విగ్రహాన్ని పెట్టాలని కవిత అనడం విడ్డూరంగా ఉందని, అధికారంలో ఉన్నప్పుడు కేసిఆర్ ఏ ఒక్కనాడు జ్యోతిరావు పూలే విగ్రహానికి కానీ, అంబేద్కర్…
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం జిల్లేడు చౌదరిగుడ మండలంలోని పెద్ద ఎల్కిచర్ల అటవీ క్షేత్రంలో చిరుత పులి అనుమానస్పద రీతిలో మృత్యు వాత పడింది. గత ఐదారు మూడు రోజుల క్రితమే చిరుత మృత్యువాత పడ్డట్టు ప్రాథమిక అంచనాగా అటవి అధికారులు గుర్తిస్తున్నారు. శనివారం ఉదయం అటవీశాఖ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని చిరుత కళేబరానికి పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. చిరుత పులి మృతికి కారణాలను పరిశీలిస్తున్నారు. ఈ సంఘటనపై అటవీశాఖ అధికారులని సంప్రదించగా వివరాలు త్వరలోనే…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కొత్తగూడెం నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ గెలిచిన స్థానాల్లో ఓడిన స్థానాల్లో కూడా ఇక్కడ ఉన్న పరిస్థితులే అక్కడ ఉన్నాయన్నారు. ముఖ్యంగా మన బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు గెలుపునకు అందరూ కృషి చేయాలని ఆయన కోరారు. మనం…
బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి టి రాజయ్య శనివారం పార్టీకి రాజీనామా సమర్పించారు. వరంగల్ లోక్సభ స్థానానికి పోటీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న రాజయ్య, పార్టీ అధిష్టానం నుండి స్పందన లేకపోవడం పార్టీకి రాజీనామా చేయాలనే నిర్ణయానికి కారణమని పేర్కొన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో బీఆర్ఎస్ అధినేత వైదొలగడం ఆ పార్టీకి చుక్కెదురైంది. ఈ పరిణామం పార్టీ ఎన్నికల సన్నద్ధతపైనా, మున్ముందు జరగబోయే ఎంపీ స్థానాల అభ్యర్థుల ఎంపికపైనా చెప్పుకోదగ్గ…
కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి బీఆర్ఎస్ సమావేశానికి మాజీ మంత్రి మల్లారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ గవర్నమెంట్ పోతుందని కలలో కూడా ఊహించలేదని ఆయన వ్యాఖ్యానించారు. గాలికి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గాలిలోనే కలిసి పోతుందని, పద్దెనిమిది యేళ్ళు పాటు పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు.తాగునీటి సాగునీరు అందించిన ఏకైక నాయకుడు కేసీఆర్ అని ఆయన అన్నారు. అంతేకాకుండా… దేశానికి అన్నం పెట్టే రైతన్నను తయారు చేసిన నాయకుడు కేసీఆర్…
హనుమకొండ జిల్లా గ్రేటర్ వరంగల్ లో పలు అభివృద్ధి పనుల పై సమీక్షా సమావేశం లో పాల్గొన్నారు దేవాదాయ,పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ. ఆమెతో పాటు వరంగల్ పశ్చిమ, వర్దన్నపేట ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సవాల్ విసిరారు. మళ్ళీ నిజామాబాద్ లో పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు కొండా సురేఖ. నిన్న కవిత మాట్లాడుతూ ప్రభుత్వం పై…