తెలంగాణ అసెంబ్లీలో జ్యోతిరావు పూలే విగ్రహాన్ని పెట్టాలని కవిత అనడం విడ్డూరంగా ఉందని, కవిత కి ఈడి నోటీసులు వచ్చినప్పుదప్పుడల్లా కవిత కు మహిళా బిల్లు గుర్తుకొస్తుందని ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ ఫైర్ అయ్యారు.వేములవాడలో జరిగిన కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ అసెంబ్లీలో జ్యోతిరావు పూలే విగ్రహాన్ని పెట్టాలని కవిత అనడం విడ్డూరంగా ఉందని, అధికారంలో ఉన్నప్పుడు కేసిఆర్ ఏ ఒక్కనాడు జ్యోతిరావు పూలే విగ్రహానికి కానీ, అంబేద్కర్ విగ్రహాన్ని గాని పూలమాల వేసిన దాఖలు లేవని, ఈడి నోటీసులు పంపించినప్పుడల్లా మహిళా బిల్లు ను తెర పైకి తీసుకొచ్చి, డ్రామాలాడుతుందని విమర్శించారు. బిఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదిన్నర ఏళ్ళలో ఒక్కనాడు కూడా రాష్ట్ర ప్రయోజనం లేదని, బడుగు బలహీన వర్గాల గురించి గానీ పట్టించుకోక పోవడమే కాకుండా, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని వేములవాడ దేవస్థానం అభివృద్ధికి 20 కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసిందని, రాబోయే రోజుల్లో దేవాలయ అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. గుడి చెరువులోకి మురుగునీరు రాకుండా, శుద్ధి చేసే కార్యక్రమాన్ని చేస్తున్నట్లు చెప్పారు.
ఇదిలా ఉంటే.. మంత్రి పొన్నం ప్రభాకర్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితపై మండిపడ్డారు. అసెంబ్లీ ప్రాంగణంలో జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటు చేయాలన్న కవిత డిమాండ్ను మరోసారి తప్పుపట్టారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో పూలే గుర్తుకు రాలేదా అంటూ ధ్వజమెత్తారు పొన్నం ప్రభాకర్. గులాబీ పార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పదవులు ఇచ్చిన తర్వాతనే సామాజిక న్యాయం గురించి మాట్లాడాలని హితవు పలికారు ఆయన. పూలే విగ్రహం పేరుతో కవిత రాజకీయం చేస్తోందని మంత్రి పొన్నం అగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో కవిత మాట్లాడేటప్పుడు అక్కడి పరిధులు తెలుసుకొని మాట్లాడాలని మంత్రి పొన్నం ప్రభాకర్ హితవు పలికారు.